సిమెంట్ రోడ్ల నిర్మాణం -సైడ్ కాలువలు సూన్యం
సిమెంట్ రోడ్ల నిర్మాణం -సైడ్ కాలవలు శూన్యం --కక్షా..వివక్షా....
ఆత్మకూరు. మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య : దశాబ్ద కాలంగా అరిచి గీ పెట్టగా సిమెంట్ రోడ్లు నిర్మించారు. సైడ్ కాలువలు ఏర్పాటు చేయలేదు. ఆ కాలనీకి మురుగునీరు ఎటు వెళ్లలేని పరిస్థితి. దాంతో అనారోగ్య వాతావరణంలో కాలం గడుపుతున్నారు. సిమెంట్ రోడ్లు ఎలాగో వేసి ఐదేళ్లు దాటింది. సైడ్ కాలవలకు మరో దశాబ్దం వేసి చూడాల్సిందేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది పాలకుల కక్ష లేక వివక్ష అని కాలనీవాసులు ప్రశ్నిస్తూ ఉంటారు. అయినా స్పందించే పరిస్థితి లేనేలేదు. ఈ కాలనీ ఆత్మకూరు పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న నువ్వురుపాడు బస్టాండ్ వద్ద ఉన్న అరుంధతియ కాలనీ. అందరూ ఎస్సీలే. ఎప్పుడు అడిగినా నిధులు కొరత అంటుంటారు. ఎస్సీ ఎస్టీ నిధులు అంటారు, ఉపాధి హామీ నిధులు అంటారు కానీ ఈ కాలనీకి మాత్రం మోక్షం కలగడం లేదు. స్వచ్ఛత, పరిశుభ్రత, వ్యక్తిగత పరిసరాలు, మన ఊరు మన పరిశుభ్రత, స్వచ్ఛ సంకల్పం అనేక కార్యక్రమాల పేర్లతో నిర్వహిస్తుండే ప్రభుత్వం అనేక దపాలు కాలనీవాసులు అరిచి గీపెడుతున్నా, పత్రికలు ఘోషిస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. ఈ కాలనీ పట్ల కక్ష చూపిస్తున్నారా వివక్ష పాటిస్తున్నారా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ కాలనీలో రోడ్లు అద్వానంగా సైడు కాలవల్లేకుండా వారు దుర్గంధం మధ్య జీవనం సాగిస్తుండేవారు. ఏడేళ్ల క్రితం కాలనీలో సిమెంట్ రోడ్లు నిర్మించారు. కానీ సైడ్ కాలువలు మాత్రం ఏర్పాటు చేయలేదు. దాదాపు 40 కుటుంబాలు ఎస్సీలు అక్కడ నివాసాలు ఉంటున్నారు. అప్పటికి రోడ్డు అంచనా కొంతమేరకు వారే కాలువలు తవ్వుకున్నారు. ఈ కాలనీకి తూర్పు దక్షిణం రెండువైపులా పంట పొలాలు ఉన్నాయి. అటు మురుగు నీరు వెళ్లే పరిస్థితి లేదు. పడమర వైపు ఎత్తు కావడంతో నీరు వెళ్లే పరిస్థితి లేదు. ఉత్తరం వైపు ఆత్మకూరు -సోమశిల మార్గం అంచున పెద్దకాలువ ఉంది. కాలనీలో సైడుకాలువలు నిర్మించి ఆ నీటిని ఉత్తర వైపు కాలువ లోకి మళ్ళిస్తే వారికి దుర్గంధం బెడద తగ్గుతుంది. కాలనీలో మురుగునీరు నిల్వ ఉంటూ తరచూ జ్వరాలు శోకడం గతంలో ఒకే ఏడు ఐదారు మందికి డెంగ్యూ సోకడం నెల్లూరు చెన్నైలకు వెళ్లి చికిత్సలు చేయించుకున్నారు. మురుగునీరు ఎటు వెళ్లే పరిస్థితి లేని విషయంలో గతంలో అనేక మంది ప్రజా ప్రతినిధులకు అధికారులకు నాయకులకు వారు విన్నవించినా ఏమాత్రం ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా అధికారులు పాలకులు నాయకులు స్పందించి కాలనీలో పరిస్థితి పరిశీలించాలని తగు చర్యలు తీసుకోవాలని వారంతా ముక్తకంఠంతో కోరుతున్నారు.