శ్రీవిగ్నేశ్వర ఆలయం ఎదుట అశుభ్రత రోడ్డు మీద షెడ్లు
అయినవిల్లి మేజర్ న్యూస్ :రాష్ట్రంలోనే ప్రసిద్ధ స్వయంభు పుణ్యక్షేత్రం అయినవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి ఆలయం పక్కన అశుభ్రత వాతావరణం నెలకొంది అన్నదానం కాంప్లెక్స్ ఎదురుగా రేకు షెడ్లు వేసి కొంతమందికి అద్దె ఇవ్వటం జరిగింది వారు ఆ షెడ్లు కి ఎదురుగా రోడ్డు మీదకు కర్రలు తడికలతో చిందర వందరగా పందుర్లు వేసి రోడ్డు వరకు ఆక్రమించారు దీంతో అక్కడ ట్రాఫిక్ సమస్య ఎక్కువైంది అక్కడ వ్యాపారుల వద్దకు వచ్చిన వారు వాహనాలు రోడ్డుపై నిలబడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి గంటలు తరబడి ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది ముక్తేశ్వరం కొత్తపేట మెయిన్ రహదారి కావడంతో విగ్నేశ్వర ఆలయం వద్ద రోడ్డు మీదే భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుంటున్నారు ట్రాఫిక్ సమస్యను ఆలయ సిబ్బంది గానీ పాలకమండలి గాని పట్టించుకోకపోవడం చర్చినియంశంగా మారింది భక్తులు ఆలయ ఎదుట ఈ షెడ్లు ఏంటని ప్రశ్నిస్తున్నారు ఈ మధ్యకాలంలో అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి వేలాదిగా భక్తులు తరలిరావడంతో వాహనాలు నిలపడానికి చోటు లేక గ్రామంలో వీధులు కిక్కిరిస్తున్నాయి వాహనాలు నిలిపే స్థానం వ్యాపారు ఆక్రమించటం ఆలయ కార్యనిర్వహకవర్గం కొంతమందికి కొమ్ముకాస్తుందని విమర్శలు వేళ్ళు వెత్తాయి కొత్తగా నియమికమైన పాలకమండలి దీనిపై దృష్టి సారించి ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేయవలసి ఉంది