శ్రీవారి సేవలో రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా
తిరుమల మేజర్ న్యూస్,
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో హరీష్ కుమార్ గుప్తా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
తిరుమల రిపోర్టర్
టి. వెంకట్ రాజ్