శ్రీపర్రు గ్రామాన్ని బాల్య వివాహరహిత గ్రామంగా తీర్చిదిద్దుదాం*
ఏలూరు రూరల్, మేజర్ న్యూస్ : ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు గ్రామంలో చైల్డ్ రైట్స్ అడ్వకసి ఫౌండేషన్ (క్రాఫ్) చైల్డ్ మ్యారేజ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రొంపిచర్ల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బాల్య వివాహ వ్యతిరేకం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వినోద్ కుమార్ మాట్లాడుతూ మన గ్రామాన్ని బాల్య వివా హరహిత గ్రామంగా తయారు చేద్దాం అని పేర్కొన్నారు. మన గ్రామంలో ఎవరైనా బాల్య వివాహాని చేసిన యెడల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాల్యవివాహాన్ని ఎవరైనా చేస్తున్నట్లయితే తెలిసిన యెడల ఉచిత చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098కు ,112 కు లేదా గ్రామపంచాయతీ సెక్రెటరీ, గ్రామ మహిళా సంరక్షణ అధికారికి మరియు సంబంధిత ప్రభుత్వ అధికారులకు సమాచారాన్ని గ్రామ ప్రజలు అందించాలని కోరారు. శ్రీపర్రు గ్రామపంచాయతీ కార్యదర్శి జి విజయలక్ష్మి మాట్లాడుతూ బాలికలకు కనీస వయసు 18 సంవత్సరములు నిడాలి, బాలుడికి కనీస వయసు 21 సంవత్సరాలు నిండాలి బాల్య వివాహం చట్టా రీత్యా నేరం, బాల్య దశలో బాల బాలికలు వారి హక్కును బాల్య దశ ,విద్య, ఆరోగ్యం ,కోల్పోకుండా మంచి విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ప్రజలకు అవగాహనను కల్పించడం జరిగింది. గ్రామంలో గాని ప్రాంతంలో గాని ఎవరైనా బాల్యవివాహాలు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవు. సచివాలయ సిబ్బంది శ్రీ పల్లవి,ఆర్. రమాదేవి క్రాఫ్ జి రాజ్యలక్ష్మి, డ్వాక్రా మహిళలతో, గ్రామ పెద్దలు కలిసి బాల్య వివాహ వ్యతిరేకంపై ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
న్యూస్ బ్యూరో బాలశౌరి, ఏలూరు జిల్లా