BREAKING
హాకీ చరిత్రలో 2026-27 సీజనే తన చివరిదంటూ అలెగ్జాండర్ ఒవెచ్కిన్ ప్రకటన తూర్పు గంగవరంలో వరుణ యాగం పాల్గొననున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లాకర్‌బీ బాంబ్ పేలుడు కేసులో 2027 జనవరికి అమెరికా కోర్టు విచారణ ఖరారు యూకే ఆన్‌లైన్ సేఫ్టీ నిబంధనలపై మెటా, టిక్‌‌టాక్, ఎక్స్ న్యాయపోరాటం చౌరస్తాలకు వెలుగులు.. హైమాస్ట్ లైట్ల ఏర్పాటు కీసరగుట్టలో అనుమానాస్పద తవ్వకాలు..! సమాజ దిశ నిర్దేశకులు ఉపాధ్యాయులే. ప్రభుత్వ ఆస్తులపై అక్రమ పెత్తనం సహించం….! బిజెపి కార్యాలయంగా ఎస్ వి యు -విద్యార్థులకు ఒక రూల్, బీజేపీకి ఒక రూల్ - ఇదేనా కూటమి ప్రభుత్వ న్యాయం.? ఎన్ ఎస్ యు ఐ పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం అనంతగిరి ఘాట్ బస్సు ప్రమాదం.. డ్రైవర్ అరెస్ట్ ప్రజా ప్రభుత్వమా... లంచాల ప్రభుత్వమా? మామిడి రైతులకు శిక్షణ -సమగ్ర యాజమాన్యంతోనే అధిక దిగుబడులు డా.ఎస్.శ్రీనివాసులు నేడు తోటపల్లి ప్రాజెక్టులో చేప పిల్లలు విడుదల కార్యక్రమం అన్ని పంచాయతీల్లోనూ 'మన్యం మర్యాద' అమలు చేయాలి

శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆహ్వానం

Select Suryaa Now
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆహ్వానం

శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆహ్వానం

➖ శ్రీశైలంలో ఘనంగా నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలు
➖ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి: మంత్రి ఆనం
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమ వెంకటసుబ్బయ్య 

  : శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి  ఆనం రామనారాయణ రెడ్డికి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్,  ఈవో  వేద పండితులు తో కలిసి సోమవారం ఆహ్వానం అందించారు.తాడేపల్లిలోని మంత్రి నివాసంలో శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్  శ్రీనివాసరావుతో పాటు ఆలయ అర్చకులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వేద ఆశీర్వచనం అందజేసి, శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.

వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు

అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు శ్రీశైల క్షేత్రంలో శరన్నవరాత్రి మహోత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు, అమ్మవార్లకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్రయాగం, చండీయాగం, జప–పారాయణాలు, అమ్మవారి ఉత్సవమూర్తికి నవదుర్గ అలంకరణ, స్వామి అమ్మవార్లకు వివిధ వాహన సేవలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు.
శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీశైల క్షేత్రానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శనం, క్యూలైన్లు, వాహనాల పార్కింగ్, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, వసతి తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు.

భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించాలి: మంత్రి ఆనం

శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై చైర్మన్, ఈవోతో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేకంగా చర్చించారు. ఉత్సవాలకు వచ్చే ప్రతి భక్తుడికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
ముఖ్యంగా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా దర్శన, క్యూలైన్ వ్యవస్థను పటిష్టం చేయాలని, వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దివ్యాంగ భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని మంత్రి సూచించారు.
అలాగే ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.
శ్రీశైలం వంటి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా, సంప్రదాయ వైభవానికి ఎలాంటి లోటు లేకుండా నిర్వహించాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను మంత్రికి వివరించారు. మంత్రి సూచించిన అంశాలను ప్రాధాన్యతతో అమలు చేస్తామని తెలిపారు.