శ్రీ నీలకంఠేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
మెలియాపుట్టి, నవంబరు 15, మేజర్ న్యూస్:
పాతపట్నంలో వెలసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. స్వామి దర్శనంతో కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ప్రసాదం అందజేశారు.
అనపాన నాగిరెడ్డి. మెలియాపుట్టి.