శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవాలయంలో లక్ష బిల్వార్చన మహోత్సవం
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండల కేంద్రమైన భట్టిప్రోలులో వేంచేసియున్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి(రథం గుడి)దేవస్థానంలో శుక్రవారం లక్ష బిల్వార్చన మహోత్సవ కార్యక్రమం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొడాలి శంకరరావు ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూజలో దామర్ల నాగేశ్వరరావు--విజయనిర్మల దంపతులు పాల్గొన్నారని ఆయన తెలిపారు. పూజా కార్యక్రమాలను దండిభోట్ల ఛాయానాథ్, దండిబోట్ల రాజేంద్ర ప్రసాద్, చావలి రాంబాబు లు పూజలను భక్తులచే నిర్వహింపజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధికారి మల్లెల రమేష్, తిరువీధుల వెంకటేశ్వరరావు (యూత్) ఒగ్గి హనుమంతరావు, గోలి శ్రీనివాసరావు, దామెర్ల గోవర్ధన నాగ బుచ్చయ్య, గుదే నాగభూలక్ష్మి, తోటకూర శంకరరావు తదితరులు పాల్గొన్నారు.