శెట్టూరు మండల ఎంపీపీగా రామలక్ష్మి ప్రమాణ స్వీకారం!
శెట్టూరు: శెట్టూరు మండల పరిషత్ అధ్యక్షురాలిగా (ఎంపీపీ) రామలక్ష్మి గారు ఘనంగా ప్రమాణ స్వీకారం చేసి నూతన బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై వేడుకను సందడిగా నిర్వహించారు.నూతన ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన రామలక్ష్మి గారికి నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా అభినందనలు తెలిపారు.
మండల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తూ శెట్టూరు మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని పలువురు ఆకాంక్షించారు.
ఖాసీం, సూర్య రిపోర్టర్, శెట్టూరు.