శెట్టిబత్తుల నాని ఏకగ్రీవం
ప్రత్తిపాడు మేజర్ న్యూస్ :
ప్రత్తిపాడు పంచాయతీ 12వ వార్డు నుండి శెట్టిబత్తుల నాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా కుటుంబానికి విధేయుడిగా ప్రత్తిపాడు ఎంపీపీ యాళ్ళ మంగాదేవి జగదీష్ కు అనుచరుడిగా సుదీర్ఘకాలంగా టిడిపిలో చేసిన సేవ కు 12వ వార్డు నుండి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ప్రత్తిపాడులో కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నాని మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 12వ వార్డుకి ఏ సమస్యలున్న ఎమ్మెల్యే సత్యప్రభ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.