BREAKING
ఎమరాల్డ్స్‌లో ఘనంగా కాన్ఫ్లుయెన్స్ 24న జల వనరుల పరిరక్షణపై జాతీయ సదస్సు నేటి పంచాంగం 22 నవంబర్, 2026 గో సంరక్షణలో సరికొత్త అధ్యాయం -దేశీయ గో సంపద పరిరక్షణలో సంచలన విజయం -56 ఐవీఎఫ్ సాహివాల్ దూడలు ఉత్పత్తి.. దేశంలోనే అరుదైన ఘనత దేశీయ ఆవుల జన్యు విప్లవం...వెటర్నరీ వర్సిటీ శాస్త్రవేత్తల అద్భుతం -తిరుపతి వెటర్నరీ వర్సిటీ సంచలన విజయం -వెటర్నరీ - టిటిడి సంయుక్త ప్రాజెక్టుతో సాధ్యం : కేంద్ర మంత్రి ప్రశంసల నేటి రాశి ఫలాలు 22 నవంబర్, 2026 నేటితో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు చివరి గడువు బెండమూర్లంక సర్పంచ్ అభ్యర్థిగా యాళ్ల శ్రీవాణి గణేష్‌పూర్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీ - అక్రమ తవ్వకాలపై డీఎస్పీ సీరియస్ హెచ్చరిక రూ.48.60 కోట్ల అభివృద్ధి.. కేసరపల్లికి మరింత ప్రగతి. సంగాపూర్ లో నేడు పోలియో చుక్కల కార్యక్రమం కొల్లూరు గ్రామ శివారులో ఆధ్యాత్మిక శోభతో వనభోజనాలు తాడిగడప అభివృద్ధి టీడీపీ, జనసేనతోనే సాధ్యం తాడిగడప అభివృద్ధే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు బోడె ప్రసాద్ ప్రచారం సింగూరుకు మరో సువర్ణావకాశం: టాటా నానో నిష్క్రమణ తర్వాత 18 ఏళ్లకు ట్రక్కుల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న అశోక్ లేలాండ్! తాడిగడపలో కూటమి అభ్యర్థులకు బోడె హేమ ప్రచారం

షేక్ శ్రీనివాసరావుకు గౌరవ అధ్యక్ష పదవి

Select Suryaa Now
షేక్ శ్రీనివాసరావుకు గౌరవ అధ్యక్ష పదవి

కంకిపాడు, మేజర్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా ముస్లిం సంక్షేమ సంఘం కృష్ణాజిల్లా గౌరవ అధ్యక్షులుగా పెనమలూరు గ్రామానికి చెందిన షేక్ శ్రీనివాసరావును నియమించారు. ఈ మేరకు శనివారం కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ చిన్నా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా షేక్ చిన్నా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు అర్హత ఉండి కూడా లబ్ధి పొందని బాధితులను గుర్తించి, వారిని సంబంధిత ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకెళ్లి అధికారులతో మాట్లాడి పథకాలు అందేలా కృషి చేయాలని శ్రీనివాసరావుకు సూచించారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేయడం ద్వారా సంఘం మరింత బలోపేతం కావడంతో పాటు సంఘానికి, బాధ్యతలు నిర్వహించే వారికి మంచి పేరు వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు షేక్ మస్తాన్ వలి, రాయుడు కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.