BREAKING
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ఫస్ట్ రివ్యూ, సెన్సార్ టాక్.. రన్ టైమ్ ఎంతంటే? జాహ్నవి రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి దీపావళికి ముందే భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అక్టోబర్ 30న తులం ఎంతంటే? తుపాను బాధిత రైతులకు శాస్త్రవేత్తల భరోసా సాఫ్ట్వేర్ ఉద్యోగం నుండి ప్రజాసేవలోకి.. అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా.. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాజ్యలక్ష్మి, కృష్ణమూర్తి గౌడ్ విస్తృత ప్రచారం 31 వ వార్డులో టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి బలరాం శెట్టి ప్రచారం కుందుర్పి లో ఊపందుకున్న కూటమి ఎన్నికల ప్రచారం. బీఆర్ఎస్ కార్యకర్త సైదులు కుటుంబానికి పిల్లుట్ల రఘు ఆర్థిక సాయం 47వ వార్డులో హోరెత్తిన తెలుగుదేశం ప్రచారం : ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి అడగుడునా అపూర్వ స్వాగతం - టిడిపి అభ్యర్థి రెడ్డి కేశవులను గెలిపించాలని విజ్ఞప్తి మదనపల్లి టిడిపి ఛైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు గెలుపే లక్ష్యం : కూటమి పార్టీల అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతు - క్రిష్టియన్ పాస్టర్స్,టైలర్స్,ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల అసోసియేషన్లు వెల్లడి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కు ప్రత్యేక కేంద్రం: వెల్దుర్తి ఆర్‌వో ప్రకటన మాజీ సీఎం జగనన్న ఆదర్శమైన పాలన దేశానికే దిక్సూచి : వైకాపా మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా - 20,21 వార్డులలో షబానా,కరీముల్లాలకు మద్ధతుగా ప్రచారం ప్రత్యేక కార్యాచరణతో 32వ వార్డును అభివృద్ధి చేస్తా : టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిని తలారి రాధమ్మ వెల్లడి మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కు పటిష్ట బందోబస్తు. జిల్లా ఎస్పీ జగదీష్.

శీలం రమేష్,రమణమ్మలను అభినందించిన ఎంపీ : 45,47 వార్డులలో ప్రచారం నిర్వహించిన మిథున్ రెడ్డి

Select Suryaa Now
శీలం రమేష్,రమణమ్మలను అభినందించిన ఎంపీ : 45,47 వార్డులలో ప్రచారం నిర్వహించిన మిథున్ రెడ్డి

 

మదనపల్లి,మేజర్ న్యూస్ : మదనపల్లి మున్సిపాలిటీ మరోసారి కైవసం చేసుకునే లక్ష్యంతో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురువారం వైకాపా కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ముమ్మర ప్రచారం నిర్వహించారు.47వ వార్డ్ అభ్యర్థి శీలం రమేష్,45వ వార్డ్ అభ్యర్థిని శీలం రమణమ్మ,చైర్మన్ అభ్యర్థి జింకా వెంకటా చలపతిలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఇందులో భాగంగా ప్రజలతో మమేకమై గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు.ప్రస్తుతం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి నామినేషన్లు వేయకుండా చేస్తున్నారని,ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు.కావున మదనపల్లి ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి కూటమి అరాచకాలకు బుద్ధి చెప్పాలన్నారు.ఇక శీలం రమేష్,రమణమ్మ దంపతులు ప్రచారం చక్కగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.గతంలో తొగట కార్పొరేషన్ డైరెక్టరుగా సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా చేనేత కార్మికుల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.వారిని మరోసారి ఆశీర్వదించి వార్డుల అభివృద్ధికి బాటలు వేయాలన్నారు.ఈ కార్యక్రమంలో వైకాపా సమన్వయకర్త నిస్సార్ అహ్మద్,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి,మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి,మాజీ జడ్పిటిసి ఉదయ్ కుమార్,దండు రామాంజులు,బొమ్మిశెట్టి మధు,చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి