BREAKING
బాపట్ల రూరల్ సీఐ గా రాంబాబు సరోగసీలో చట్టబద్ధతకు పెద్దపీట: డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె. ఆనంద్‌ గ్లోబల్ హిట్ వెబ్ సిరీస్ అరాఫ్తా షూటింగ్ అనుభవాలు పంచుకున్న టర్కిష్ నటులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి ఫ్లైదుబాయ్ పైలట్ సాహసాన్ని కొనియాడిన బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ గోవింద నామ స్వర్ణతో మారుమోగిన వెంకటనారాయణ నాట్యమండలి జిల్లా మహాసభలు జయప్రదం చేయాలి జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డీప్‌‌ఫేక్ వీడియోపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు రైతులకు తమిళనాడు ప్రభుత్వం కొండంత అండ గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక మాజీ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకల్లో ఆర్‌బీఓఎల్ సీఈవో జాతీయస్థాయిలో సత్తా చాటిన ఉమామహేశ్వరపురం విద్యార్థిని. దళిత ఉప సర్పంచ్ పై దాడిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు దళిత, బహుజన సంఘాల ధర్నా పేరూరు గురుకులంలో ఆధునిక హంగులు

శాంతియుత సమాజ స్థాపనకు అహింసా మార్గమే ఆచరణీయం విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్

Select Suryaa Now
శాంతియుత సమాజ స్థాపనకు అహింసా మార్గమే ఆచరణీయం విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్

 

విజయనగరం అక్టోబర్ 2 మేజర్ న్యూస్ 

 

జిల్లా పోలీసు కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ 157వ జయంతిని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో అక్టోబరు 2న ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో జిల్లా ఎస్పీ శ్రీ ఎ.ఆర్.దామోదర్ 
పాల్గొని, మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ - భారత దేశ స్వాతంత్ర్య సాధనకు అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకునివచ్చి, అహింస ద్వారా స్వాతంత్ర్య పోరాటం చేసిన మహనీయుడు గాంధీజీ అని అన్నారు. సమాజంలో శాంతియుత
స్ధాపనకు మహాత్ముడు చూపిన అహింసా మార్గం, సెక్యులరిజం అన్నవి ప్రతీ ఒక్కరూ ఆచరించాల్సిన మార్గాలన్నారు. సమాజంలో శాంతిని ఎల్లప్పుడూ కోరుకొనే పోలీసుశాఖ మహాత్మా గాంధీ చూపిన అహింస, శాంతి మార్గంలోనే
పయనించి, ప్రజల్లో మార్పును తీసుకొని రావాలన్నారు. ప్రజలను మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు, వారిని హింసా ప్రవృత్తికి దూరం చేసి, అహింసా మార్గంలో పయనించే విధంగా పోలీసు ఉద్యోగులు తమవంతు కృషి చేయాలన్నారు.
మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకొని ప్రతీ ఒక్కరూ ఆయన చూపిన శాంతి మార్గంలో పయనించి, నిజాయితీతో,
దేశం పట్ల గౌరవం, భక్తి కలిగి, శాంతిభద్రతలకు ఎటువంటి భంగం కలగకుండా ప్రతీ ఒక్కరూ తమవంతు కృషి చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాల వైపు యువత ఆకర్షితులైతే, వారికి కౌన్సిలింగు నిర్వహించి, వారిని సక్రమమైన మార్గంలో నడిచే విధంగా మార్గ నిర్ధేశం చేయాలన్నారు. హింసాత్మక సంఘటనలు నుండి యువత ప్రేరణ పొందవద్దని, ప్రతీ ఒక్కరూ గాంధీజీ చూపిన అహింసా మార్గంలో నడవాలని, పోలీసులకు సహకరించాలని యువతకు, ప్రజలకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎఆర్ అదనపు ఎస్పీ పి.కిరణ్ కుమార్, డీపీఓ ఏఓ శ్రీనివాస్, ఆర్ఐలు
ఎన్.గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, టి.శ్రీనివాసరావు, పలువురు ఆర్ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొని, మహాత్మా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి, పుష్పాలు సమర్పించి మహాత్మునికి ఘనంగా నివాళులు అర్పించారు.