BREAKING
దీక్షా దివస్ సభ సక్సెస్ కు కౌశిక్ రెడ్డి ప్రచారం నర్సీపట్నంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ భవనానికి శంకుస్థాపన పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గుమ్మిడి దంపతులకు నీలమ్మ కాలనీ సచివాలయ ఉద్యోగులు సత్కారం అలయ్ బలయ్ గోడ ప్రతి ఆవిష్కరణ. ఎస్సీ కమిషన్ సభ్యులను కలిసిన సర్పంచ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ చింతకాయల పద్మావతి ఆకస్మిక తనిఖీ చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ మేడిపల్లి సత్యం. జడ్పీ చైర్‌పర్సన్ మజ్జి సిరి సహస్త్రను మర్యాదపూర్వకంగా కలిసిన గుమ్మడి సింహాద్రి. నా గెలుపు మరుపెంట పంచాయతీ ప్రజలకే అంకితం! ఎల్‌నినో ముప్పుపై రామగుండం అప్రమత్తం! బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థుల ర్యాలీ జంగులూరు వెలంపాలెం పంచాయతీలో హోరెత్తిన కూటమి ప్రచార జోరు! ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ విద్యార్థులు.

సేవా తపస్సు... అరుణ ది దాతృత్వ మనస్సు..!

Select Suryaa Now
సేవా తపస్సు... అరుణ ది దాతృత్వ మనస్సు..!

సేవా తపస్సు... అరుణ ది దాతృత్వ మనస్సు..!
- చీకట్లో మాతృత్వపు వెలుగు 
- కొత్తపల్లె డిప్యూటీ తహసిల్దార్ అరుణ


నందికొట్కూరు రూరల్ మేజర్ న్యూస్ - : కొత్తపల్లి మండల పరిధిలోని ఎర్రమఠం గ్రామ మజార గ్రామమైన  బలపాల తిప్పా, చెంచుగూడెంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదంలో సజీవదహనమైన బాలుడు ధర్మతేజ కుటుంబానికి కొత్తపల్లి డిప్యూటీ తహసిల్దార్ అరుణ ఆపన్న హస్తం అందించి
 మానవత్వానికి నిదర్శనంగా నిలిచారు.ఘటనా స్థలానికి చేరుకున్న ఆమె, బాలుడి మృతికి తల్లడిల్లుతున్న తల్లిని చూసి చలించిపోయారు. ఆ తల్లిలోని మాతృత్వపు ఆవేదనను ఒక తల్లిగా అర్థం చేసుకున్నారు.గుండెలవిసేలా రోదిస్తున్న ఆ బాలుడి తల్లిని ఓదార్చడం డిప్యూటీ తహసిల్దార్ అరుణ కు కష్టమైంది.వెంటనే స్పందించి, ప్రభుత్వం నుండి సహాయం అందే వరకు ఆగకుండా, తన సొంత బాధ్యతగా బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.వెంటనే ఆ కుటుంబానికి నిత్యావసర సరుకులు - బియ్యం,చలిలో వణుకుతున్న కుటుంబం కోసం బెడ్ షీట్లు, దుప్పట్లు తల్లికి చీరలు కాలిపోయిన వంట సామాగ్రికి బదులుగా కొత్త వంట పాత్రలు, సామాన్లుఅన్నీ స్వయంగా తీసుకెళ్లి అందించారు. "అధికారి అంటే కేవలం సంతకం పెట్టడం కాదు, ఆపదలో ఉన్నవాడికి ఆపన్న హస్తం అందించడం" అని ఆమె నిరూపించారు. ఒక అధికారిగా కాకుండా ఒక మాతృమూర్తిగా బాధిత కుటుంబానికి ఆపన్న హస్తం అందించిన డిప్యూటీ తహసిల్దార్ అరుణ ను అభినందిస్తున్న గిరిజనవాసులు మరియు తోటి ఉద్యోగులు.ఆ చెంచుగూడెంలో ఇప్పుడు రెండు వెలుగులు ఉన్నాయి. ఒకటి ఆ చిన్నారి ప్రాణం తీసిన సోలార్ వెలుగు. ఇంకొకటి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పిన అరుణమ్మ మాతృత్వపువెలుగు.ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ జరిపి, అడవి బిడ్డల గుడిసెలపై ఏర్పాటు చేసే సోలార్ వ్యవస్థలకు సరైన భద్రతా ప్రమాణాలు పాటించేలా చూడాలని, మృతి చెందిన ధర్మతేజ కుటుంబానికి ప్రభుత్వ పరంగా పూర్తి నష్టపరిహారం అందించాలని స్థానికులు అభినందించారు.