BREAKING
ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దసరాకు రాష్ట్రపతి రాక సమగ్ర శిశు అభివృద్ధి సేవలను మరింత బలోపేతం చేయాలి.. : జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం.ఏడు మండలాల తహసీల్దార్లతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్ష ప్రజా సమస్యలపై వెలంపల్లి పోరాటాన్ని అడ్డుకోవద్దు : వైసీపీ మాజీ కార్పొరేటర్ల హెచ్చరిక ఈసీ వైపు ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ: అదుపులోకి తీసుకున్న ఎంపీల విడుదల

సీఐఐ రీజనల్ సమ్మిట్‌ను సమన్వయంతో విజయవంతం చేయాలి

Select Suryaa Now
సీఐఐ రీజనల్ సమ్మిట్‌ను సమన్వయంతో విజయవంతం చేయాలి

 

*ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్

విశాఖపట్నం, అక్టోబర్ 06: గంభీరంలోని ఐఐఎం-విలో బుధవారం జరగనున్న సీఐఐ రీజనల్ సమ్మిట్‌ను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. మంగళవారం ఐఐఎంలో సమ్మిట్‌ కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఏపీఈడీబీ సీఈవో సగిలి షాన్మోహన్, ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ బన్షాల్, జేసీ విద్యాధ‌రి, డీసీపీ మ‌ణికంఠ తదితరులతో కలిసి కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. సమ్మిట్ నిర్వహణకు సంబంధించి ప్రధాన వేదిక, సమాంతర సమావేశాలు, ఎగ్జిబిషన్, ఏపీ పెవిలియన్, ప్రతినిధుల రిజిస్ట్రేషన్, పార్కింగ్, వేదికల వద్ద మౌలిక వసతులు, సైన్‌బోర్డులు, ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు తదితర అంశాలను చూసిన ఆయ‌న‌ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలని సూచించారు.

సీఐఐ రీజనల్ సమ్మిట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ పారిశ్రామిక సంస్థలు, కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని స్పష్టం చేశారు. సమ్మిట్‌ ద్వారా ఉత్తరాంధ్రలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధికి అనుకూలమైన వాతావరణం, మౌలిక వసతులు, అందుబాటులో ఉన్న వనరులు, వివిధ రంగాల్లో పెట్టుబడులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను పారిశ్రామికవేత్తలకు వివరించేలా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అన్ని సంబంధిత శాఖలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని, అప్పగించిన బాధ్యతల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వరాదని స్పష్టం చేశారు. వివిధ విభాగాల అధికారులు, ఏపీఈడీబీ, పరిశ్రమల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.