సౌత్ మోపూర్‌లో వైసీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ
నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి ఆదేశాలతో జిల్లా ఉపాధ్యక్షులు చెవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచనలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పంచాయతీ విభాగం అధ్యక్షులు బండ్ల రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం నాడు సౌత్ మోపూర్ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డులు అందజేస్తూ పార్టీ పట్ల క్రమశిక్షణతో, నిబద్ధతతో పనిచేయాలని నాయకులు సూచించారు.ఈ సందర్భంగా బండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ...ఐడీ కార్డు కలిగిన ప్రతి కార్యకర్తను పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా గుర్తిస్తారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు.అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులకు పలు సూచనలు చేస్తూ, గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ మండలం ముస్లిం మైనార్టీ ఉపాధ్యక్షులు షేక్ కరీం బాష మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.