BREAKING
తాడిగడప మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఫామ్‌–బి అందజేత విజయ డెయిరీ అవినీతిపై కోర్టులో పోరాడుతున్నా.. రాజకీయాలకు సంబంధం లేదు అక్వాన్ తుపానును ఎదుర్కొనేందుకు ఏపీఈపీడీసీఎల్ సన్నద్ధం ఎన్‌జీసీ రిగ్ గ్యాస్ లీకేజీ ఘటన పూర్తిగా అదుపులోకి... యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! యూరప్‌లో టీవీ ప్రకటనల ఆదాయానికి భారీ గండి.. ఖర్చుల కోతకు సిద్ధమవుతున్న బ్రాడ్‌కాస్టర్లు! పుస్తక పఠనంతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు! అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఎలాంటి లోపాలకు తావులేకుండా తుది ఓటరు జాబితా రూపొందించాలి అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు మొజాంబిక్‌ ప్రతిపక్ష నేత వెనాన్సియో మొండ్లానేకు విచారణ ప్రారంభం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ! పేదల జీవితాల్లో కొత్త వెలుగులు.. ప్రజాప్రభుత్వం "చేయూత" పేదల కళ్లలో ఆనందం.. ప్రజాప్రభుత్వ సంక్షేమం గాజాలో ఆగని మరణమృదంగం.. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల నడుమ అపెక్ సదస్సు యంగ్ ఇండియా స్కూల్ సమీపంలో మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి – విద్యార్థుల భవిష్యత్తు, ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడొద్దు

సత్యవరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈఓ రవిబాబు...

Select Suryaa Now
సత్యవరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈఓ రవిబాబు...


- పదో తరగతి విద్యార్థులకు పరీక్షలపై దిశానిర్దేశం.. 
- యోగా పోటీల నిర్వహణపై సమీక్ష

నరసన్నపేట నవంబర్ 17 మేజర్ న్యూస్: మండలంలోని సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఏ. రవిబాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యాబోధన, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరిశీలించారు. బుధవారం జరగనున్న సాంఘిక శాస్త్ర పరీక్షకు సంబంధించి పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు మరింత శ్రద్ధతో చదివి, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని, ప్రతి ఒక్కరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని సూచించారు.

అనంతరం ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించనున్న యోగా పోటీల ఏర్పాట్లపై డీఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయులతో సమావేశమై పోటీల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, ఇతర శాఖల అధికారుల సహకారం తదితర అంశాలపై చర్చించారు. యోగా పోటీలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించాలని సంబంధిత ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలినాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఓకలా రత్నమాల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.