BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

సరస్వతీ దేవి అలంకారంలో జొన్నవాడ కామాక్షితాయి కనువిందు

Select Suryaa Now
సరస్వతీ దేవి అలంకారంలో జొన్నవాడ కామాక్షితాయి కనువిందు

నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ 
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన పవిత్ర మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ కామాక్షితాయి అమ్మవారు చదువుల తల్లి ‘శ్రీ సరస్వతీ దేవి’ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్వేత వస్త్రాలు ధరించి, చేతులలో వీణ, పుస్తకం, జపమాలతో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు, ముఖ్యంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మహా సరస్వతీ పూజను భక్తిశ్రద్ధలతో జరిపించారు. విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞానం, ఉన్నత విద్యా ప్రాప్తి కలగాలని ఆకాంక్షిస్తూ తల్లిదండ్రులు తమ చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసాలు, ప్రత్యేక పూజలు చేయించారు.
ఈ పర్వదినం సందర్భంగా గత పదేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం సింగరాయకొండ వాస్తవ్యులైన శ్రీ కామాక్షితాయి భక్త బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు ‘పుస్తక ప్రసాద’ పంపిణీ జరిగింది. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకంగా పూజించిన నోట్ పుస్తకాలు, పెన్నులు, ఇతర విద్యా సామగ్రిని ఆలయానికి విచ్చేసిన చిన్నారులకు, విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. దేవస్థాన సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వెంకట శ్రీనివాసులు రెడ్డి ఆలయ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.