సమిష్టి కృషితోనే మున్సిపల్ విజయం
సమష్టి కృషితోనే మున్సిపల్ విజయం
--జగనన్నకు ఆత్మకూరు విజయాన్ని కానుకగా ఇద్దాం
--నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలి
-=మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పిలుపు
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమ వెంకటసుబ్బయ్య :
రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ కి చెందిన ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త సమిష్టిగా పనిచేయాలని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మకూరులోని మేకపాటి కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై పట్టణ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల పరిశీలకులు పేర్నాటి కోటేశ్వరరెడ్డి, కూనం సుధాకర్‌రెడ్డిలతో కలిసి ఆయన సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంపై పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు, విభేదాలకు తావివ్వకుండా పార్టీ విజయమే పరమావధిగా ముందుకు సాగాలని సూచించారు. ఆత్మకూరు మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేసి, ఆ విజయాన్ని జగనన్నకు కానుకగా అందించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
రాబోయే ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ వైసీపీ అభ్యర్థిగా బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని ప్రకటించడం నియోజకవర్గంపై పార్టీ అధినేతకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఆ విశ్వాసాన్ని విజయంగా మలిచేందుకు నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని పిలుపునిచ్చారు.
*కార్యకర్తే పార్టీకి బలం ఐక్యతే విజయానికి మార్గం*
పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని, జగనన్న 2.0లో కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని విక్రమ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీలోని 28 వార్డుల్లో ఏ ఒక్క కార్యకర్తకు సమస్య ఎదురైనా పార్టీ నాయకులంతా అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు అండగా ఉండటంతో పాటు, వారి కృషికి తగిన గుర్తింపు కల్పించడం పార్టీ బాధ్యత అన్నారు.
వార్డుల వారీగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కార్యాచరణ రూపొందించుకోవాలని, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారి విశ్వాసాన్ని చూరగొనాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ, ఒకరి విజయానికి మరొకరు సహకరించినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా క్రమశిక్షణతో పనిచేయాలని కోరారు.
*అభ్యర్థి ఎవరైనా.. గెలుపే లక్ష్యం కావాలి*
ఆత్మకూరు మున్సిపాలిటీలోని 28 వార్డుల్లో నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు పరిచయమున్నవారేనని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. వార్డుల రిజర్వేషన్లు ఖరారైన అనంతరం అభ్యర్థుల ఎంపికకు అనుగుణంగా పార్టీ శ్రేణులంతా ఒకే తాటిపైకి వచ్చి పనిచేయాలని సూచించారు. అభ్యర్థి ఎవరనే దానికంటే పార్టీ విజయం ముఖ్యమని, పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో పరస్పర సహకారం, సమన్వయం, పట్టుదల కీలకమని పేర్కొన్నారు. ప్రతి వార్డులో పార్టీ బలాన్ని పెంచుకుంటూ ప్రజల మద్దతు కూడగట్టాలని, చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి ఉమ్మడి లక్ష్యంతో ముందుకు సాగాలని అన్నారు. నాయకత్వంపై నమ్మకం, కార్యకర్తల్లో ఐక్యత, ప్రజల్లో విశ్వాసం ఉన్నప్పుడే విజయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
*పార్టీ గుర్తింపు కార్డుల పంపిణీ*
సమావేశం అనంతరం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. పార్టీ గుర్తింపు కార్డు పొందడం గౌరవంతో పాటు బాధ్యత కూడా అని, పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని నాయకులు సూచించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సమష్టి కృషితో విజయాన్ని సాధించి జగనన్నకు కానుకగా అందించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, రాష్ట్ర మున్సిపల్ విభాగ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షుడు నందా ఓబులేసు, పార్టీ ఉపాధ్యక్షులు ఆండ్రా సుబ్బారెడ్డి, తోడేటి మణి, మైనారిటి అధ్యక్షుడు మీరా మొహిద్దీన్, ఇందూరు సురేంద్రరెడ్డి, రహీం, షారూక్, సుబ్బారెడ్డి, జనార్థన్ రెడ్డి, శ్రీను, జమ్రు, నారాయణరెడ్డి, వెంగళరెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి, చల్లా వేణు, ఉల్సా పెంచలయ్య, , రమేష్, సురేష్, సుబ్బయ్య, కొండా చిన వెంకటేశ్వర్లు, దిలీప్, చిల్లూరు రాకేష్, ముజీబ్, మస్తాన్ వళి, కె వినోద్, యాకసిరి కొండయ్య, , శ్రీకాంత్, నందవరం ప్రతాప్, కల్పనారెడ్డి, షేక్ మర్వీన్, కామాక్షయ్యనాయుడు, మల్లికార్జున, చిన్నరాయుడు తదితరులు పాల్గొన్నారు.