సమతుల్యమైన పోషకాహారం అందించడమే లక్ష్యం సూపర్వైజర్ సుభద్రమ్మ
వేంపల్లె మేజర్ న్యూస్:
చిన్నారులకు, గర్భిణీ, బాలింత మహిళలకు సమతుల్యమైన పోషకాహారం అందించడమే జాతీయ పోషణ మాసం లక్ష్యమని ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభద్రమ్మ తెలిపారు. గురువారం మండలంలోని నాగూరు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్తహినత తగ్గించడం, తల్లులు, పిల్లల్లో ఆరోగ్యంపై అవగాహన పెంచడం, బాలల సమగ్ర వికాసానికి అవసరమైన వాతావరణం కల్పించడమే పోషణ మాసం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శ్రీలత, తల్లులు, పిల్లలు, గర్భిణీ, బాలింత మహిళలు తదితరులు పాల్గొన్నారు.
గండికోట షేక్ ఖదీర్, వేంపల్లె.
వైఎస్ఆర్ కడప జిల్లా.