సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్నిస్థాయిలలో పోలీస్ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేందుకు ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుండి ప్రక్రియ ముగిసే వరకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలన్నారు.రెవెన్యూ,మున్సిపల్ అధికారులతో కలిసి పోలింగ్ కేంద్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి.సమస్యాత్మక కేంద్రాలను ముందుగానే గుర్తించాలని,పాత నేరస్థులు,గొడవలు సృష్టించే వారిని తక్షణమే బైండోవర్ చేయాలన్నారు.అసాంఘిక శక్తులను అరికట్టేందుకు ముమ్మరంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించాలన్నారు.అక్రమాలను అరికట్టేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు.సీసీ కెమెరాలు,డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తూ,ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలి.సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు (ఫేక్ న్యూస్) చేసే వారిని గుర్తించి,వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేలా పోలీసులు గ్రామాల్లో పర్యటనలు,పల్లెనిద్ర వంటి కార్యక్రమాలు చేపట్టి వారిలో ధైర్యం నింపాలి.జిల్లాలో లైసెన్స్ కలిగిన తుపాకులు,ఇతర ఆయుధాలు ఉన్నవారిని వెంటనే గుర్తించి,వాటిని పోలీసు స్టేషన్లలో డిపాజిట్ చేయించాలన్నారు.ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా,ఎవరి బెదిరింపులకు భయపడకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి, మదనపల్లె నియోజకవర్గం ఇంచార్జి