రోటరీ ఆద్వర్యంలో రజతోత్సవ వేడుకలు
గూడూరు, మేజర్‌న్యూస్ : రోటరీ క్లబ్‌లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రొటేరియన్స్‌ను ఘనంగా సన్మానించారు. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రొట్టెరియన్స్ కిరణ్ చక్రవర్తి, పివి కృష్ణయ్య, బీమా శివకుమార్ రెడ్డి, జిఎస్ రాఘవరెడ్డి, పి రఘురాం రెడ్డి, ఎం దయాకర్ రెడ్డి, పి నిరంజన్ రెడ్డిలను సన్మానించారు. ఈ సందర్భంగా బొమ్మిరెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ వీరందరూ రోటరీకి ఎన్నో సేవలు చేశారని రోటరీ ఈ స్థాయిలో ఉండటం వారు ఎంతో కృషి చేశారని వారి సేవలను కొనియాడారు. కొత్తగా చేరుతున్న రొటీరియన్స్ కు ఆదర్శప్రాయులని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎం బాలకృష్ణ రాజు వాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి, ఎల్లసరి గోపాల్ రెడ్డి గూడూరు వెస్ట్ క్లబ్ సభ్యులు, ఇన్నర్ వీల్ సభ్యులు పాల్గొన్నారు.