రూలింగ్ స్టోరీస్’ సినిమా పోస్టర్ ఆవిష్కరణ దసరా సందర్భంగా పోస్టర్‌ను ఆవిష్కరించిన ఆరే శ్యామలరెడ్డి
‘రూలింగ్ స్టోరీస్’ సినిమా పోస్టర్ ఆవిష్కరణ
దసరా సందర్భంగా పోస్టర్‌ను ఆవిష్కరించిన ఆరే శ్యామలరెడ్డి
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
‘రూలింగ్ స్టోరీస్ – ఇది పాలన కాదు.. పగే!’ సినిమా పోస్టర్‌ను దసరా పండుగ సందర్భంగా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరే శ్యామలరెడ్డి ఆవిష్కరించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే, నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆశీస్సులతో, ఆయన పర్యవేక్షణలో పాలకొలను రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
ఈ సందర్భంగా సినిమా విజయవంతం కావాలని ఆరే శ్యామలరెడ్డి ఆకాంక్షించారు. ప్రేక్షకుల ఆదరణతో చిత్రం మంచి విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.