BREAKING
కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్.. ఏఐ ఫేక్ కంటెంట్‌పై సంచలన పిటిషన్ *ఓటు హక్కుపై గళమెత్తిన కాంగ్రెస్‌* ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యలో మెరిసిన ప్రశాంత్ - బిఆర్ఎవోయు స్నాతకోత్సవంలో బంగారు పతకం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం మృతుల కుటుంబాలను పరామర్శించిన యువ నాయకుడు సీబీ మంజునాథ్‌రెడ్డి

Select Suryaa Now
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం  మృతుల కుటుంబాలను పరామర్శించిన యువ నాయకుడు సీబీ మంజునాథ్‌రెడ్డి

అనంతపురం బ్యూరో : గుత్తి పట్టణ సమీపంలోని చెరువుకట్ట వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గొల్లలదొడ్డి గ్రామానికి చెందిన భార్గవ్, పురుషోత్తమ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ప్రమాద విషయం తెలుసుకున్న గుంతకల్లు నియోజకవర్గ యువ నాయకుడు సీబీ మంజునాథ్‌రెడ్డి గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మార్చురీలో ఉన్న యువకుల మృతదేహాలకు నివాళులర్పించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.

అదేవిధంగా గుత్తి పట్టణంలోని బండగేరికి చెందిన మరో యువకుడు మృతి చెందడంతో అతని మృతదేహానికి కూడా నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నారాయణస్వామి, మాజీ కౌన్సిలర్లు వాల్మీకి శివరాం, వరదరాజులు, వైసీపీ నాయకులు బింగి కిరణ్‌బాబు, హనుమేష్, జగదీష్, అరుణ్‌కుమార్, వాల్మీకి పవన్‌కుమార్ తదితరులతో పాటు గొల్లలదొడ్డి గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.