BREAKING
అంబాజీపేట ఎంపీపీ రేసులో అనంతలక్ష్మి తులసి భూ రీ సర్వే పారదర్శకంగా చేపట్టాలి సీతంపేటలో ఘనంగా దీపావళి బతుకమ్మ వేడుకలు జాతీయ లోక్ అదాలత్ ను జయప్రదం చేయాలి బిక్కవోలులో జనసేనకు 100 శాతం విజయం. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కళ్యాణి ఎంపిక. ఎం.డి.ఆర్.టి. అర్హత సాధించిన కర్రీ అజయ్ రెడ్డి దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు చిట్యాల విద్యార్థులు ఎంపిక కళ చెదిరింది రైతుకు కన్నీరే మిగిలింది బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి కె.గంగవరంలో తుఫాన్ బియ్యం పంపిణీకి ఏర్పాట్లు పూర్తి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సిబ్బంది తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి.. జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు.. మిరియాల వెంకట్రావుకు ఘన నివాళులు

రోడ్డు ప్రమాద బాధితురాలి కుటుంబానికి మానవత ఆపన్నహస్తం

Select Suryaa Now
రోడ్డు ప్రమాద బాధితురాలి కుటుంబానికి మానవత ఆపన్నహస్తం

గోపాలపురం,మేజర్ న్యూస్ :ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని గోపాలపురం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చాటిచెప్పింది. గోపాలపురం తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఏగా పనిచేస్తున్న వేళ్లచింతలగూడెంకు చెందిన నామాల నాగమణి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. కుడిచేయి ఎముక రెండు చోట్ల విరగడంతో ప్లేట్లు వేసి శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. ఇప్పటికే భార్యాభర్తలిద్దరూ వికలాంగులు కావడం, ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో ఆ కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. ఈ విషయం తెలుసుకున్న మానవత సంస్థ స్పందించి రూ.7 వేల ఆర్థిక సహాయం అందించింది. అలాగే పిల్లలకు నోటుపుస్తకాలు పంపిణీ చేసింది.

ఈ సహాయంలో సంస్థ తరఫున రూ.4 వేలు, చైర్మన్ జొన్నలగడ్డ రాంబాబు రూ.వెయ్యి, సభ్యుడు రాయల్ రూ.వెయ్యి, జిల్లా రక్తనిధి డైరెక్టర్ జోడాల వెంకట్ రూ.500, అధ్యక్షుడు ఎండపల్లి శేఖర్‌బాబు రూ.500 అందించారు.

ఈ సందర్భంగా శేఖర్‌బాబు మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్నవారికి మానవత సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, నాగమణి కుటుంబానికి భవిష్యత్తులోనూ సహకారం అందిస్తామని తెలిపారు. జోడాల వెంకట్ మాట్లాడుతూ.. సంస్థ సేవా కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని, ఏడాదికి రూ.600 సభ్యత్వ రుసుముతో మరిన్ని సేవా కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.