BREAKING
ఎమరాల్డ్స్‌లో ఘనంగా కాన్ఫ్లుయెన్స్ 24న జల వనరుల పరిరక్షణపై జాతీయ సదస్సు నేటి పంచాంగం 22 నవంబర్, 2026 గో సంరక్షణలో సరికొత్త అధ్యాయం -దేశీయ గో సంపద పరిరక్షణలో సంచలన విజయం -56 ఐవీఎఫ్ సాహివాల్ దూడలు ఉత్పత్తి.. దేశంలోనే అరుదైన ఘనత దేశీయ ఆవుల జన్యు విప్లవం...వెటర్నరీ వర్సిటీ శాస్త్రవేత్తల అద్భుతం -తిరుపతి వెటర్నరీ వర్సిటీ సంచలన విజయం -వెటర్నరీ - టిటిడి సంయుక్త ప్రాజెక్టుతో సాధ్యం : కేంద్ర మంత్రి ప్రశంసల నేటి రాశి ఫలాలు 22 నవంబర్, 2026 నేటితో డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు చివరి గడువు బెండమూర్లంక సర్పంచ్ అభ్యర్థిగా యాళ్ల శ్రీవాణి గణేష్‌పూర్‌లో పోలీసుల ఆకస్మిక తనిఖీ - అక్రమ తవ్వకాలపై డీఎస్పీ సీరియస్ హెచ్చరిక రూ.48.60 కోట్ల అభివృద్ధి.. కేసరపల్లికి మరింత ప్రగతి. సంగాపూర్ లో నేడు పోలియో చుక్కల కార్యక్రమం కొల్లూరు గ్రామ శివారులో ఆధ్యాత్మిక శోభతో వనభోజనాలు తాడిగడప అభివృద్ధి టీడీపీ, జనసేనతోనే సాధ్యం తాడిగడప అభివృద్ధే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు బోడె ప్రసాద్ ప్రచారం సింగూరుకు మరో సువర్ణావకాశం: టాటా నానో నిష్క్రమణ తర్వాత 18 ఏళ్లకు ట్రక్కుల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న అశోక్ లేలాండ్! తాడిగడపలో కూటమి అభ్యర్థులకు బోడె హేమ ప్రచారం

రెడ్డిగూడెంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యయ నిర్వహణపై సమగ్ర సమీక్ష

Select Suryaa Now
రెడ్డిగూడెంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యయ నిర్వహణపై సమగ్ర సమీక్ష

విజయవాడ, మేజర్ న్యూస్ : ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయకుమార్ శనివారం రెడ్డిగూడెం మండలంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల వ్యయ నిర్వహణ ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి, సబ్ ఇన్‌స్పెక్టర్, ఎన్నికల వ్యయ బృందం సభ్యులతో సమావేశమై, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఎన్నికల వ్యయ పర్యవేక్షణ తీరును అడిగి తెలుసుకున్నారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై సమర్థవంతమైన పర్యవేక్షణ అత్యంత కీలకమని ఎన్నికల వ్యయ పరిశీలకులు స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థికి ప్రత్యేకంగా షాడో రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశించారు. అభ్యర్థులు సమర్పించే ఖర్చుల వివరాలను పరిశీలించి, క్షేత్రస్థాయిలో వాస్తవంగా జరుగుతున్న వ్యయంతో సరిపోల్చేందుకు ఈ రిజిస్టర్లు ఉపయోగపడతాయని తెలిపారు. అభ్యర్థులు రోజువారీ ఎన్నికల వ్యయ వివరాలను నిర్ణీత సమయంలో అకౌంటింగ్ బృందానికి సమర్పించాలని సూచించారు. ఖర్చుల వివరాలను సమర్పించని అభ్యర్థులకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ర్యాలీలు, సభలు, లౌడ్‌స్పీకర్ల వినియోగానికి సంబంధించి జారీ చేసే అనుమతుల ప్రతులను నిఘా, పర్యవేక్షణ నిమిత్తం అకౌంటింగ్ బృందం వద్ద ఉంచాలని తెలిపారు. తద్వారా ఆయా కార్యక్రమాలకు సంబంధించిన వ్యయాన్ని అభ్యర్థుల ఖాతాల్లో సక్రమంగా నమోదు చేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు.

ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టును తనిఖీ చేసిన పరిశీలకులు

రంగాపురం వద్ద రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ చెక్‌పోస్టును ఎన్నికల వ్యయ పరిశీలకులు తనిఖీ చేశారు. రెడ్డిగూడెం మండలంలోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేస్తున్న బృందం, తనిఖీల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశించారు. ఉప ఎంపీడీఓ నేతృత్వంలోని ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం వాహన వివరాలతో సహా ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు. రోజువారీ నివేదికలను రెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయంలోని అకౌంటింగ్ బృందానికి సమర్పించాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళిని, ఎన్నికల వ్యయ పర్యవేక్షణ మార్గదర్శకాలను అధికారులు, సంబంధిత బృందాలు కచ్చితంగా పాటించాలని, ఎటువంటి లోపాలకు తావులేకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు స్పష్టం చేశారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.