రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం సీఎం వెల్లడి రైతుల సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు శుక్రవారం ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం నర్సింగ్ హోల్ గ్రామంలో మీ భూమి మీ హక్కు తోపాటు పట్టాదాల పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రివర్యులు డాక్టర్ డోలా సి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రైతుబిడ్డగా రైతుల కష్టాలు తీర్చే వ్యక్తి అని మరోసారి గుర్తు చేశారు ప్రకాశం జిల్లాలో ఒకేరోజు 334 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యలను సీఎం చంద్రబాబు పరిష్కారం చూపారని మరోసారి గుర్తు చేశారు ప్రకాశం జిల్లాలోని నాలుగు మండలాల ఎనిమిది గ్రామాల్లో2915 ఎకరాల గర్భ కండిక భూముల సమస్యకు పరిష్కారం చూపారని గత ఐదేళ్ల అధికారంలో సైకో పరిపాలనలో గర్భ ఖండిక భూముల సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని ఆయన తప్పుపట్టారు కొండేపి నియోజకవర్గంలో 39వేల మంది రైతులకు పట్టాదాల పాసుపుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది అన్నారు టిడిపి అధికారం వచ్చి రెండున్నర సంవత్సరం కాలయవధిలో కొండేపి నియోజకవర్గంలో 700 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశామని మంత్రి స్వామి ఈ సభాపూర్వకంలో సీఎం దృష్టికి తీసుకుని వచ్చారు కొండేపి నియోజకవర్గంలోని చివర ప్రాంతాలైన పాలేరు పాకల బిగినిపల్లి లకు వెలుగొండ జలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జీవో ఇచ్చారని మరోసారి గుర్తు చేశారు గత ఐదు సంవత్సరాల సంగమేశ్వర ప్రాజెక్టును పట్టించుకోకుండా వైసిపి గాలికి వదిలేసారని నేడు కూటమి ప్రభుత్వంలో టెండర్లను పూర్తి చేశామని సిగ్గులేకుండా గొడ్డలి పార్టీ మాపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మరోసారి గుర్తు చేశారు కొండేపి నియోజకవర్గం కొండేపి ప్రజల ఆదరణకు దామచర్ల కుటుంబం సహకారంతో తాను మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యానని ఈ సభాపూర్వకంలో మంత్రి స్వామి పేర్కొన్నారు ఈ మండలంలో 4000 మంది రైతులకు పట్టాదాల పాసుపుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని మంత్రివర్యులు పేర్కొన్నారు