రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా
పాయకరావుపేట సెప్టెంబర్ 30 మేజర్ న్యూస్.
రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో పాయకరావుపేట మెయిన్ రోడ్ లో గల ప్రభుత్వ ఐటిఐ కాలేజీలో జిల్లా అధికారిని రోహిణి ఆధ్వర్యంలో బుధవారం జాబ్ మేళా నిర్వహించారు.ఈ జాబ్ మేళాలో సుమారు 16 కంపెనీలు పాల్గొనగా అనేకమంది నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్,రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరి,టిడిపి మండల అధ్యక్షుడు చించలపు పద్దు, పట్టణ అధ్యక్షుడు యాళ్ళ వరహాల బాబు, పాండురంగ స్వామి దేవస్థానం చైర్మన్ మజ్జూరి నారాయణరావు,కంకిపాటి వెంకటేశ్వరరావు,జనసేన పట్టణ అధ్యక్షుడు ఆచంట దొర,మల్లపు రెడ్డి రమాకుమారి,యూత్ అధ్యక్షుడు గొల్లపల్లి నాగు,వేములపూడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.