రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి.. మాజీ ఎంపీ బెల్లాన్ని చంద్రశేఖర్
రామభద్రపురం, సూర్య : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ ఎంపీ బెల్లాన్ చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు శనివారం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు బెల్లానచంద్రశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని, యూరియా కొరతతో రైతులు పంటల సాగులో అవస్థలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలుస్తూ, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో బొత్స సత్యనారాయణ సహకారంతో తోటపల్లి రిజర్వాయర్ అందుబాటులోకి వచ్చిందని గుర్తుచేశారు. దీని ద్వారా సుమారు 1.24 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని విమర్శించారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సమావేశంలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయడం వంటి అంశాలపై నాయకులు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, గ్రామస్థాయి కమిటీల్లో నియమితులైన సభ్యులకు , బెల్లాన చంద్రశేఖర్ గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.
వైఎస్సార్‌సీపీ , మాజీ జడ్పీటీసీ అప్పికొండ సరస్వతమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శులు శంబంగి వేణుగోపాల్ నాయుడు బొబ్బిలి మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీకృష్ణ జిల్లా వైఎస్ఆర్సిపి మహిళా విభాగ అధ్యక్షురాలు సామంతులనిర్మలమ్మ యూత్ అధ్యక్షులు.ఏక్ నాథ్ మాజీ జేఏసీ కన్వీనర్ చింతల సింహాచలంనాయుడు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ డబ్ల్యు రాయులు ఉపాధ్యక్షుడు డర్రుపైడిరాజు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రిపోర్టర్ : రామకృష్ణ, రామభద్రపురం, విజయనగరం జిల్లా.