BREAKING
నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో విజయ్ సేతుపతి సంచలన సినిమా.. ఓటీటీలో వ్యూవర్స్‌ను కట్టిపడేస్తున్న చిత్రం! దుర్గాలమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేలు విరాళం. అంగన్వాడీలకు ముగిసిన రెండో విడత శిక్షణ. చోరీ కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష. రణ్‌బీర్ కపూర్ 'రామాయణం' సినిమాపై మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ఆసక్తికర రివ్యూ! మేయర్ శ్రావణికి నీలబాబు అభినందన పిల్లల సమగ్ర అభివృద్ధిపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ విద్యతోనే అభివృద్ధి సాధ్యం. ఉచిత మెగా వైద్య శిబిరంలో 236 మందికి పరీక్షలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ దంపతులు.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన కడెం వంశిత! అంగన్వాడీలకు పోషకాహారంపై అవగాహన తెల్ల బియ్యానికి బదులు ఎర్ర బియ్యం తింటే ఇన్ని లాభాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన ప్రయోజనాలు! త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు:మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేజర్ పంచాయితీ మనదే కావాలి... జాతీయ స్థాయి పోటీలకు పి ఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు..

రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో కడియం మండల విద్యార్థుల ప్రతిభ

Select Suryaa Now
రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో కడియం మండల విద్యార్థుల ప్రతిభ

                                మండల స్థాయిలో ముగ్గురు విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు.

కడియం, మేజర్ న్యూస్ ,భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కడియం మండల స్థాయి పోటీలను జడ్పీహెచ్ఎస్ కడియంలో నిర్వహించినట్లు మండల విద్యాశాఖాధికారి-2 వై. నాగేశ్వరరావు తెలిపారు. ఈ పోటీల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు ఆయన పేర్కొన్నారు.
జడ్పీహెచ్ఎస్ వీరవరానికి చెందిన అప్పాడి హేమశ్రీ దుర్గ మొదటి స్థానం, జడ్పీహెచ్ఎస్ కడియంకు చెందిన ఎస్. ప్రశాంత్ రెండో స్థానం, జడ్పీహెచ్ఎస్ మురమండకు చెందిన గొల్లపల్లి నవీనప్రియ మూడో స్థానం సాధించినట్లు వెల్లడించారు.
విజేతలుగా నిలిచిన ముగ్గురు విద్యార్థులు ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వై. నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ కడియం ప్రధానోపాధ్యాయులు టి. సత్యనారాయణ, మండల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.