రాజాం మున్సిపోల్ కు కౌంట్ డౌన్
రాజాం మేజర్ న్యూస్ : రాజాం మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను మున్సిపల్ యంత్రాంగం పూర్తి చేసింది. మున్సిపాలిటీ సహాయ ఎన్నికల అధికారి, కమిషనర్ రామచంద్రరావు లెక్కింపు కేంద్రాన్ని సందర్శించి, సిద్ధం చేసిన వసతులను పరిశీలించారు.
65.48 శాతం పోలింగ్
మున్సిపాలిటీలోని 32 వార్డులకు నవంబర్ 26న పోలింగ్ జరిగింది. మొత్తం 49 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. పట్టణంలో 36,787 మంది ఓటర్లు ఉండగా, 24,088 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ శాతం 65.48గా నమోదైంది.
లెక్కింపు కేంద్రం, టేబుళ్ల
బొబ్బిలి రోడ్డులోని వరలక్ష్మి సెయింట్ ఆన్స్ స్కూల్‌లో రెండో అంతస్తులోని 5వ తరగతి గది (ఏ)ని లెక్కింపు కేంద్రంగా ఎంపిక చేశారు. ఒకే హాలులో మొత్తం 32 టేబుళ్లు ఏర్పాటు చేయగా, వీటిలో 16 టేబుళ్లు వార్డు సభ్యుల ఓట్ల కోసం, మిగిలిన 16 చైర్‌పర్సన్ ఓట్ల కోసం కేటాయించారు. లెక్కింపు రెండు రౌండ్లలో సాగి, అవి పూర్తయ్యాక ఫలితాలు వెలువడతాయి.
96 మంది సిబ్బంది
ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించారు. ఈ లెక్కన 32 మంది సూపర్‌వైజర్లు, 64 మంది అసిస్టెంట్లు కలిపి మొత్తం 96 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు.