BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

రావులపాలెం గ్రామపంచాయతీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు

Select Suryaa Now
రావులపాలెం గ్రామపంచాయతీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు

రావులపాలెం మేజర్ న్యూస్

పారిశుధ్య నిర్వహణలో అగ్రగామిగా ఉన్న కోనసీమ ముఖద్వారం రావులపాలెం గ్రామపంచాయతీకి స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంద్ర అవార్డు దక్కింది. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా ఈ అవార్డును పంచాయతీ అభివృద్ధి అధికారి ఎల్ దుర్గాప్రసాద్ అందుకోనున్నారు. సుమారు 35 వేల జనాభాతో విస్తరించి ఉన్న ఈ గ్రామం పారిశుద్ధ్య నిర్వహణలో భేష్ అనిపించుకుంటుంది. ఇంటింటికి చెత్త సేకరణ, అలాగే చెత్త నుండి సంపద తయారీ కేంద్రం నిర్వహణ తదితర విషయాల్లో ఈ పంచాయతీకి అవార్డు దక్కింది. ఇప్పటికే రాష్ట్రంలోనే తొలి ఐఎస్ఓ సర్టిఫికెట్ ను ఈ రావులపాలెం పంచాయతీ అందుకున్న సంగతి తెలిసిందే. గ్రామంలో వార్డులన్నిటిని పది విభాగాలుగా విభజించి సక్రమంగా పారిశుధ్య నిర్వహణ చేపట్టడం అలాగే ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించి ప్రజలకు తడిపొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించడం  వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 12 గ్రామపంచాయతీలు ఈ అవార్డుకు ఎంపికయ్యాయి. అందులో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో గల ఐదు జిల్లాల పరిధిలో కేవలం రెండు పంచాయతీలకు ఈ అవార్డు దక్కింది.రావులపాలెంతో పాటు కాకినాడ జిల్లా గండేపల్లి గ్రామ పంచాయతీ ఈ అవార్డుకు ఎంపికైంది.