పురుషుడిలో ఆడవారిలాగా వక్షోజాల పరిమాణం సరి చేసిన కిమ్స్ కర్నూలు వైద్యులు*
- పురుషుల్లో ఛాతీ పెరుగుదలకు శస్త్రచికిత్సతో పరిష్కారం
- 27 ఏళ్ల యువకుడికి విజయవంతంగా చికిత్స
*కర్నూలు, అక్టోబర్ 07, 2026:* అసాధారణ రీతిలో ఆడవారిలాగా వక్షోజాలు పెరిగి ఇబ్బంది పడుతున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స ద్వారా ఉపశమనం కలిగించారు కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు వైద్యులు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు చికిత్సనందించిన కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్ డా. నవ్య.
కర్నూలు జిల్లాకు చెందిన 27 ఏళ్ల యువకుడికి కుడివైపు ఛాతీ భాగం ఎడమవైపు కంటే ఎక్కువగా పెరిగి ఉండటంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. టీషర్టులు ధరించడంతో పాటు బహిరంగ ప్రదేశాలు, సామాజిక కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు అసౌకర్యంగా ఉండేది. దీంతో మానసికంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. సర్జరీ కోసం పలు ఆస్పత్రులు తిరిగిన ఫలితం లేకపోవడంతో శాశ్వత పరిష్కారం కోసం కిమ్స్ హాస్పిటల్‌లో మమల్ని సంప్రదించారు. వైద్య పరీక్షల అనంతరం ఛాతీలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తొలగించేందుకు ఇరువైపులా లైపోసక్షన్ నిర్వహించారు. కుడివైపు ఉన్న అదనపు గ్రంథి కణజాలాన్ని తొలగించేందుకు సబ్‌క్యూటేనియస్ మాస్టెక్టమీ చేశారు. దీంతో ఛాతీ ఆకృతి సహజంగా, సమతుల్యంగా మారింది.
శస్త్రచికిత్స అనంతరం మరుసటి రోజు నుంచే రోగి సాధారణంగా నడవగలిగారని వైద్యులు తెలిపారు. ఎలాంటి సమస్యలు లేకుండా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశామన్నారు.
పురుషుల్లో గైనకోమాస్టియా సాధారణంగా కనిపించే సమస్యేనని తెలిపారు. అయితే ఛాతీ పెరుగుదల కారణంగా కొందరిలో ఆత్మవిశ్వాసం తగ్గడంతో పాటు దుస్తులు ధరించడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడంలో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.
ఛాతీలో కొవ్వు అధికంగా ఉంటే లైపోసక్షన్, గ్రంథి కణజాలం ఎక్కువగా ఉంటే శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించడం చేస్తామని తెలిపారు. అవసరాన్ని బట్టి రెండు విధానాలను కలిపి నిర్వహించడం ద్వారా మెరుగైన ఆకృతిని సాధించవచ్చన్నారు. సరైన వైద్య అంచనా, ప్రణాళికతో గైనకోమాస్టియాకు సమర్థవంతంగా చికిత్స చేయవచ్చని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రోగికి చికిత్స అందించారు.