ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో 5న పీజీఆర్ఎస్ రద్దు
ప్రొద్దుటూరు, అక్టోబర్ 3 మేజర్ న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 5వ తేదీ సోమవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రొద్దుటూరు, పురపాలక సంఘంలో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని, ప్రజలతో కమీషనర్ ముఖాముఖీ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ముఖ్యంగా ప్రొద్దుటూరు రానున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కమీషనర్ కోరారు.