ప్రత్యేక అలంకరణలో అమ్మవార్లు
ఉదయగిరి, మేజర్ న్యూస్ : .దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన సోమవారం అవ మ్మవార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పట్టణంలోని పార్వతీపరమేశ్వర, బాలాజీనగర్, సంతానలక్ష్మీ, మండలంలోని గండిపాళెం గంగమ్మ ఆలయాల్లో అమ్మవార్లను అర్చకులు గాయత్రీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు అధికసం ఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించి కాయాకర్పూరం అందజేసి మొక్కులు తీర్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరిం చారు.