ప్రత్తి పంట ను పరిశీలించిన శాస్త్రవేత్త రమేష్.
బేస్తవారిపేట, మేజర్ న్యూస్.
బేస్తవారిపేట మండలం లోని జేబీ కృష్ణాపురం గ్రామంలో కెవికె దర్శి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ జి రమేష్ ప్రత్తి పంట ను మంగళవారం క్షేత్ర సందర్శన చేశారు. ప్రత్తి లో వేడి గాలులు మరియు అధిక ఉష్ణోగ్రత కారణంగా రసం పీల్చే పురుగుల ఉదృతి ఎక్కువగా ఉంటుందని తెలిపారు పంట లో పచ్చ దోమ ఎక్కువ గ ఉంది అని గుర్తించారు వరిలో నివారణకుఎకరానికి అసెటాంప్రైడ్ 60 గ్రాములు లేదా డైఫీంతురాన్ 50% 80 గ్రాములు పిచికారీ చేయాలనీ తెలిపారు నివారణకు మరియు 13:0:45 పత్తి పంటలో పిచికారీ చేసినట్లు అయితే కొంత వరకు పంట బెట్టకు తట్టుకుంటుంది అని తెలిపారు. ఇతర పైర్లు కూడ వర్షభావ పరిస్థితులలో బెట్టకు గురైనపుడు 13-0-45 2 కేజీలు ఎకరానికి పిచికారి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ రఫీక్ షేక్ , గ్రామ వ్యవసాయ సహాయకులు అవ్వారి ప్రవీణ్ కుమార్ మరియు రైతులు పాల్గొన్నారు.