BREAKING
నేటి రాశి ఫలాలు: 30 సెప్టెంబర్ 2026, బుధవారం.. 12 రాశుల దినఫలితాలు నేటి పంచాంగం: 30 సెప్టెంబర్ 2026, బుధవారం పంచాంగ విశేషాలు, శుభాశుభ సమయాలు ఎన్‌సీసీ ‘బి’ సర్టిఫికెట్ల పంపిణీ క్రమశిక్షణ, దేశభక్తితో ముందుకు సాగాలి ప్రిన్సిపాల్ డా. ఎస్. స్మిత.. జడ్పీ చైర్మన్ రేసులో నేనూ ఉంటా….! రూ.5,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రభుత్వ వైద్యుడు: విజిలెన్స్ వలలో ఉత్తరాఖండ్ డాక్టర్ క్రేన్ బోల్తా ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్ పద్మారావు నగర్లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ విజయవాడకు నేడు సీఎం చంద్రబాబు సిరిసిల్లకు నేడు సీఎం రేవంత్.. భారీ సభకు ఏర్పాట్లు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే పొరపాట్లు.. వంటగదిలో ఈ తప్పులు అస్సలు చేయకండి తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు బిగ్ బాస్ హౌస్‌లో త్రిగుణ్, అపూర్వ మధ్య తీవ్ర వాగ్వాదం.. నువ్వు చేసే పనులకు ఇరిటేటింగ్‌గా ఉందంటూ ఆగ్రహం నేచురల్ స్టార్ నాని బ్లడీ రోమియో సినిమాపై క్రేజీ అప్డేట్.. హీరోయిన్ ఎవరంటే? డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రం గొప్ప విజయం సాధించాలి.. ఎన్టీఆర్ ఆకాంక్ష! అల్లిపూర్ సర్పంచ్ వీరేశం మృతి

ప్రసూతి ఆస్పత్రిలో విషాదం -ఆపరేషన్ ఆలస్యంతో శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ

Select Suryaa Now
ప్రసూతి ఆస్పత్రిలో విషాదం  -ఆపరేషన్ ఆలస్యంతో శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ

తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వడమాలపేట మండలం వడమాల గ్రామానికి చెందిన పవిత్ర భర్త ఉమాపతి ఈ నెల 26న ఆస్పత్రిలో చేరారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం- ఆపరేషన్ అవసరమని మధ్యాహ్నం 3 గంటలకే సంతకాలు తీసుకున్నప్పటికీ, రాత్రి 11:45 గంటలకు మాత్రమే ఆపరేషన్‌కు తీసుకెళ్లారని, తెల్లవారుజామున 12:45 గంటలకు బిడ్డ మృతి చెందినట్లు సమాచారం ఇచ్చారని ఆరోపిస్తున్నారు. సకాలంలో వైద్యం అందించి ఉంటే బిడ్డ ప్రాణాలు దక్కేవని, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
వైద్యం అందించడంలో ఎందుకు ఆలస్యం జరిగింది.?ఆపరేషన్ 8 గంటలు ఎందుకు ఆలస్యం చేశారు.బిడ్డ మృతికి అసలు కారణం ఏమిటి అని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటనపై పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కోరుతూ ఈరోజు ఉదయం 9 గంటలకు తిరుపతి ప్రసూతి ఆస్పత్రి వద్ద మీడియా సమావేశానికి పిలుపునిచ్చారు.