BREAKING
సీఎం పర్యటన వేళ తంగళ్లపల్లి బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్ సిరిసిల్లలో నేడు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ గుర్రం జాషువా సాహిత్య సేవలు చిరస్మరణీయం భారత జీడీపీకి యూట్యూబ్ నుంచి రూ.18,000 కోట్లకు పైగా ఊతం శిశు ఆహార ఉత్పత్తులపై మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కఠిన నిబంధనలు 1న పామూరుకు ఉపాస్ హాస్పిటల్ డాక్టర్ చావల ప్రకాష్ రాక ఆల్‌కార్గో లాజిస్టిక్స్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓగా విజయ్ నెహ్రా నియామకం అక్టోబర్ 1 నుంచి స్కోడా కార్ల ధరల పెంపు దేశీయ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల ధరల మోత ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. చెన్నై ఆసుపత్రిలో తుదిశ్వాస రూ.6,500 కోట్ల ఎంవోయూలతో ముగిసిన యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో వాణిజ్య బలోపేతమే లక్ష్యంగా భారత్‌లో స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ పర్యటన క్యూబ్ హైవేస్ ట్రస్ట్‌లో ముబదాల వాటాల విక్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైన కరీంనగర్ నూతన పాలనా భవనం ‘కలాం స్కూల్ ఆఫ్ బయోసైన్స్’ను ప్రారంభించిన మాస్టర్స్ యూనియన్

పద్మారావు నగర్లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ

Select Suryaa Now
పద్మారావు నగర్లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ

* పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు, నాయకులు
* ఆనందంతో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్న
నేతలు
* అధికారమే ద్యేయంగా పని చేయాలి
* తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కడెం అర్చన

సికింద్రాబాద్ సనత్నగర్ నియోజక వర్గం పద్మారావు నగర్ లో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కడెం అర్చన ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ కార్యకర్తలు ప్రజలతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ విజయం సాధించడం, కవిత ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఉచిత విద్యా, వైద్యం అందించడమే తమ ప్రధమ లక్ష్యమని అందుకోసం పోరాటాలు చేస్తామని, అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. డివిజన్‌లో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రక్షణసేన పార్టీ అధికారికంగా తన ప్రధాన అంశాల్లో సామాజిక న్యాయం, మహిళలు, యువత, రైతులు మరియు ప్రజా సంక్షేమాన్ని ప్రస్తావిస్తోందని తెలిపారు. సనత్‌నగర్ నియోజకవర్గం జెండా ఆవిష్కరణ ఇన్‌చార్జ్ తేజ చౌదరి, సికింద్రాబాద్ పార్లమెంట్ జెండా ఆవిష్కరణ ఇన్‌చార్జ్ డేవిడ్, టీఆర్‌ఎస్ పార్టీ ఖైరతాబాద్ ఇన్‌చార్జ్ చంద్రశేఖర్,  యువజన అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా కర్ణాటి చంద్రకాంత్,  టీఆర్‌ఎస్ నాయకులు, సికింద్రాబాద్ సాయి నేత,  టీఆర్‌ఎస్ నాయకులు, కార్వాన్ గంగాధర్,  టీఆర్‌ఎస్ నాయకులు, కూకట్‌పల్లి సుకుమార్,  పార్టీ నాయకులు, మహిళా కార్యకర్తలు, యువత, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.