అల్లిపూర్ సర్పంచ్ వీరేశం మృతి
అనారోగ్యంతో కన్నుమూత.. మండల సర్పంచుల సంతాపం
దారూర్,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 30): ధరూర్ మండలం అల్లిపూర్ గ్రామ సర్పంచ్ వీరేశం బుధవారం ఉదయం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.వీరేశం మృతి పట్ల మండలంలోని పలువురు సర్పంచులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వీరేశం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. రిపోర్టర్ సుధాకర్.