ఎన్‌సీసీ ‘బి’ సర్టిఫికెట్ల పంపిణీ క్రమశిక్షణ, దేశభక్తితో ముందుకు సాగాలి ప్రిన్సిపాల్ డా. ఎస్. స్మిత..
ఎన్‌సీసీ ‘బి’ సర్టిఫికెట్ల పంపిణీ
క్రమశిక్షణ, దేశభక్తితో ముందుకు సాగాలి
ప్రిన్సిపాల్ డా. ఎస్. స్మిత..
కడప మేజర్ న్యూస్
ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (ఏ), కడపలో ఎన్‌సీసీ విభాగం ఆధ్వర్యంలో ఎన్‌సీసీ ‘బి’ సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 5(ఏ) గర్ల్స్ బెటాలియన్ ఎన్‌సీసీ, తిరుపతి నుంచి పీఐ సిబ్బంది హాజరై, కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. స్మితతో కలిసి 33 మంది ఎన్‌సీసీ క్యాడెట్లకు ‘బి’ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. స్మిత మాట్లాడుతూ ఎన్‌సీసీ ‘బి’ సర్టిఫికెట్ సాధించిన 33 మంది క్యాడెట్లను అభినందించారు. ఎన్‌సీసీ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి పెంపొందుతాయని పేర్కొన్నారు. ‘బి’ సర్టిఫికెట్‌తో తమ ప్రయాణాన్ని ఆపకుండా, ఇదే పట్టుదలతో శిక్షణను కొనసాగించి ‘సి’ సర్టిఫికెట్‌ను కూడా సాధించాలని ఆకాంక్షించారు. ఎన్‌సీసీ శిక్షణ ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో విద్య, ఉద్యోగ రంగాల్లో లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం ఎన్‌సీసీ సీటీఓ పి. సుజాత మాట్లాడుతూ సర్టిఫికెట్లు పొందిన క్యాడెట్లను అభినందించారు. ఎన్‌సీసీలో సాధించిన ప్రతి విజయమూ క్యాడెట్ల క్రమశిక్షణ, నిరంతర సాధన, పట్టుదలకు నిదర్శనమని అన్నారు. ఎన్‌సీసీ శిక్షణను కేవలం సర్టిఫికెట్ సాధనకే పరిమితం చేయకుండా, జీవితంలో క్రమశిక్షణ, బాధ్యత, సేవాభావం, నాయకత్వ స్ఫూర్తిని అలవర్చుకోవాలని సూచించారు. దేశం పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యతతో ముందుకు సాగుతూ కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని క్యాడెట్లకు పిలుపునిచ్చారు. 5(ఏ) గర్ల్స్ బెటాలియన్ ఎన్‌సీసీ, తిరుపతి పీఐ సిబ్బంది క్యాడెట్లను అభినందిస్తూ, క్రమశిక్షణతో శిక్షణను కొనసాగించి దేశసేవకు సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌సీసీ క్యాడెట్లు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 33 మంది క్యాడెట్లు ‘బి’ సర్టిఫికెట్లను అందుకున్నారు..