BREAKING
సీఎం పర్యటన వేళ తంగళ్లపల్లి బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్ సిరిసిల్లలో నేడు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ గుర్రం జాషువా సాహిత్య సేవలు చిరస్మరణీయం భారత జీడీపీకి యూట్యూబ్ నుంచి రూ.18,000 కోట్లకు పైగా ఊతం శిశు ఆహార ఉత్పత్తులపై మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కఠిన నిబంధనలు 1న పామూరుకు ఉపాస్ హాస్పిటల్ డాక్టర్ చావల ప్రకాష్ రాక ఆల్‌కార్గో లాజిస్టిక్స్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓగా విజయ్ నెహ్రా నియామకం అక్టోబర్ 1 నుంచి స్కోడా కార్ల ధరల పెంపు దేశీయ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ల ధరల మోత ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ కన్నుమూత.. చెన్నై ఆసుపత్రిలో తుదిశ్వాస రూ.6,500 కోట్ల ఎంవోయూలతో ముగిసిన యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో వాణిజ్య బలోపేతమే లక్ష్యంగా భారత్‌లో స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ పర్యటన క్యూబ్ హైవేస్ ట్రస్ట్‌లో ముబదాల వాటాల విక్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైన కరీంనగర్ నూతన పాలనా భవనం ‘కలాం స్కూల్ ఆఫ్ బయోసైన్స్’ను ప్రారంభించిన మాస్టర్స్ యూనియన్

అనంతపురం పార్లమెంట్‌ పరిధిలో కూటమి సమన్వయ సమావేశం

Select Suryaa Now
అనంతపురం పార్లమెంట్‌ పరిధిలో కూటమి సమన్వయ సమావేశం

అనంతపురం పార్లమెంట్‌ పరిధిలో కూటమి సమన్వయ సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికలపై మూడు పార్టీల నేతల చర్చ

అనంతపురం, సెప్టెంబర్‌ 29: అనంతపురం పార్లమెంట్‌ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమి స్థానిక సంస్థల సమన్వయ సమావేశం మంగళవారం అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు.

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, అనంతపురం జిల్లా ఎన్నికల అబ్జర్వర్ సామినేని ఉదయభాను, అహుడా చైర్మన్ టీసీ వరుణ్‌తో కలిసి గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కూటమి నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

అనంతపురం పార్లమెంట్‌ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా నేతలు సూచించారు. కూటమి అభ్యర్థుల విజయానికి మూడు పార్టీల శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జయరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి జయమ్మ, అనంతపురం నగర అధ్యక్షుడు పొదిలి బాబురావు, కళ్యాణదుర్గం పీఓసీ బాల్యం రాజేష్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పుల నాగరాజు, జోనల్ ఇన్‌చార్జ్ రెడ్డప్ప శ్రీనివాస్‌రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ హాజరయ్యారు.

భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు కొండకండ్ల రాజేష్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సమన్వయం, కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించారు.