BREAKING
ప్రజా తీర్పుపై అలిగి ప్రతిపక్షం పలాయనం.. రాష్ట్ర పునర్నిర్మాణమే కూటమి లక్ష్యం: సీఎం చంద్రబాబు అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ప్రవేశాల గడువు 13 వరకు పొడిగింపు డీఎంకే మురళి సేవలు చిరస్మరణీయం.. బీసీల ఓట్లు కావాలి కానీ.. సీట్లు మాత్రం వద్దా?* ముగిసిన ఎర్రవల్లి భూముల సర్వే.. కలెక్టర్‌కు నివేదిక సమర్పించిన అధికారులు పాలకీడు పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఆకస్మిక తనిఖీ* కారు, ద్విచక్ర వాహనం తో పాటు ఎర్ర చందన దుంగలు స్వాధీనం. ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు లో సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారుల కసరత్తు ఘనంగా అంగన్ వాడీ ఉత్సవాలు, జాతీయ పోషణ మాసం పోలేరమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు మానవతా సేవలే దామన్నకు ఘన నివాళి* మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి నివాళులు.. మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి.. సేవా సంకల్ప్ అభియాన్ మెగా మెడికల్ క్యాంప్ ప్రారంభం

గుర్రం జాషువా సాహిత్య సేవలు చిరస్మరణీయం

Select Suryaa Now
గుర్రం జాషువా సాహిత్య సేవలు చిరస్మరణీయం

గుర్రం జాషువా సాహిత్య సేవలు చిరస్మరణీయం

అనంతపురంలో జాషువా విగ్రహానికి టీడీపీ నేతల పుష్పాంజలి

అనంతపురం: ప్రజాకవి, మహనీయుడు గుర్రం జాషువా జయంతి సందర్భంగా అనంతపురం నగరంలో ఆయన విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవితో కలిసి జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా నాయకులు గుర్రం జాషువా సాహిత్య సేవలను స్మరించుకున్నారు. సమాజంలో సమానత్వం, సామాజిక చైతన్యం, మానవతా విలువలను తన రచనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లిన జాషువా సాహిత్య సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం కోసం జాషువా తన రచనల ద్వారా చేసిన కృషి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన సాహిత్యం సామాజిక చైతన్యానికి మార్గదర్శకంగా నిలిచిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జాషువా అభిమానులు తదితరులు పాల్గొని ప్రజాకవికి ఘన నివాళులు అర్పించారు.