BREAKING
ఉక్రెయిన్‌లోని కీవ్, ఒడెస్సా నగరాలపై రష్యా భీకర వైమానిక దాడులు యూరోపియన్ యూనియన్‌లో బినాన్స్ కార్యకలాపాలపై ఈయూ అధికారుల ప్రశ్నలు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కాంజేరీ సెల్వరాజ్ ఉత్తర కొరియాతో చర్చలు పునరుద్ధరించాలి పెన్షన్ పథకం కాదు బాధ్యత; పోలీ శివకుమార్ తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు.. 2-3 రోజుల్లో మార్పులు జర్నలిస్టుల ఆందోళనను విజయవంతం చేయాలి హాంగ్ కాంగ్ చేతిలో ఓడిన భారత మహిళల స్క్వాష్ జట్టు తణుకు నియోజకవర్గ కాపు జేఏసీ అధ్యక్షుడిగా దిరిశాల సురేష్ నియామకం: రాష్ట్ర చైర్మన్ అమ్మ శ్రీనివాస్ నాయుడుకు కృతజ్ఞతలు గల్ఫ్ శాంతి చర్చలపై ఇరాన్‌కు అమెరికా ప్రతిస్పందన అందజేత సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన యూపీఐ లావాదేవీలు నేడు మండలంలో సర్వసభా సమావేశం - ఎంపీడీవో ఉమాదేవి గూగుల్ జెమిని 4 ఫ్లాగ్‌షిప్ ఏఐ మోడల్ 'ఆర్గాన్' ప్రకటన రష్యా 'రాస్వెట్' ఉపగ్రహ నెట్‌వర్క్‌‌కు మద్దతిచ్చే సంస్థలపై ఆంక్షలు విధించాలని అమెరికాను కోరిన ఉక్రెయిన్ కువైట్‌లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో 'ఇండియా-కువైట్ మీడియా కనెక్ట్' వేదిక ప్రారంభం

విజయవాడకు నేడు సీఎం చంద్రబాబు

Select Suryaa Now
విజయవాడకు నేడు సీఎం చంద్రబాబు

విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు విజయవాడలో పర్యటించనున్నారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించే ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో ఆయన పాల్గొని పేద కుటుంబాలకు ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేయనున్నారు. 

ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలోని 24,057 కుటుంబాలకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేలా పట్టాల పంపిణీ చేపట్టనున్నారు. మొత్తం 617 ఎకరాల భూమికి సంబంధించిన ఈ ప్రక్రియతో సుమారు రూ.9,800 కోట్ల విలువైన భూమిపై లబ్ధిదారులకు హక్కులు లభించనున్నాయి. 

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం చూపే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. విజయవాడ నగరంలోని పలు నియోజకవర్గాలతో పాటు పరిసర ప్రాంతాల కుటుంబాలు ఈ పట్టాల ద్వారా లబ్ధి పొందనున్నాయి.