BREAKING
ఉక్రెయిన్‌లోని కీవ్, ఒడెస్సా నగరాలపై రష్యా భీకర వైమానిక దాడులు యూరోపియన్ యూనియన్‌లో బినాన్స్ కార్యకలాపాలపై ఈయూ అధికారుల ప్రశ్నలు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కాంజేరీ సెల్వరాజ్ ఉత్తర కొరియాతో చర్చలు పునరుద్ధరించాలి పెన్షన్ పథకం కాదు బాధ్యత; పోలీ శివకుమార్ తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు.. 2-3 రోజుల్లో మార్పులు జర్నలిస్టుల ఆందోళనను విజయవంతం చేయాలి హాంగ్ కాంగ్ చేతిలో ఓడిన భారత మహిళల స్క్వాష్ జట్టు తణుకు నియోజకవర్గ కాపు జేఏసీ అధ్యక్షుడిగా దిరిశాల సురేష్ నియామకం: రాష్ట్ర చైర్మన్ అమ్మ శ్రీనివాస్ నాయుడుకు కృతజ్ఞతలు గల్ఫ్ శాంతి చర్చలపై ఇరాన్‌కు అమెరికా ప్రతిస్పందన అందజేత సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన యూపీఐ లావాదేవీలు నేడు మండలంలో సర్వసభా సమావేశం - ఎంపీడీవో ఉమాదేవి గూగుల్ జెమిని 4 ఫ్లాగ్‌షిప్ ఏఐ మోడల్ 'ఆర్గాన్' ప్రకటన రష్యా 'రాస్వెట్' ఉపగ్రహ నెట్‌వర్క్‌‌కు మద్దతిచ్చే సంస్థలపై ఆంక్షలు విధించాలని అమెరికాను కోరిన ఉక్రెయిన్ కువైట్‌లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో 'ఇండియా-కువైట్ మీడియా కనెక్ట్' వేదిక ప్రారంభం

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు

Select Suryaa Now
తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో టోకెన్లు లేని భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.

నిన్న శ్రీవారిని 77,082 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,039 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.22 కోట్ల ఆదాయం సమకూరినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.

భక్తుల రద్దీ నేపథ్యంలో క్యూలైన్ల వద్ద అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు సహనంతో సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.