BREAKING
నేటి రాశి ఫలాలు: 30 సెప్టెంబర్ 2026, బుధవారం.. 12 రాశుల దినఫలితాలు నేటి పంచాంగం: 30 సెప్టెంబర్ 2026, బుధవారం పంచాంగ విశేషాలు, శుభాశుభ సమయాలు ఎన్‌సీసీ ‘బి’ సర్టిఫికెట్ల పంపిణీ క్రమశిక్షణ, దేశభక్తితో ముందుకు సాగాలి ప్రిన్సిపాల్ డా. ఎస్. స్మిత.. జడ్పీ చైర్మన్ రేసులో నేనూ ఉంటా….! రూ.5,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రభుత్వ వైద్యుడు: విజిలెన్స్ వలలో ఉత్తరాఖండ్ డాక్టర్ క్రేన్ బోల్తా ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్ పద్మారావు నగర్లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ విజయవాడకు నేడు సీఎం చంద్రబాబు సిరిసిల్లకు నేడు సీఎం రేవంత్.. భారీ సభకు ఏర్పాట్లు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే పొరపాట్లు.. వంటగదిలో ఈ తప్పులు అస్సలు చేయకండి తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు బిగ్ బాస్ హౌస్‌లో త్రిగుణ్, అపూర్వ మధ్య తీవ్ర వాగ్వాదం.. నువ్వు చేసే పనులకు ఇరిటేటింగ్‌గా ఉందంటూ ఆగ్రహం నేచురల్ స్టార్ నాని బ్లడీ రోమియో సినిమాపై క్రేజీ అప్డేట్.. హీరోయిన్ ఎవరంటే? డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రం గొప్ప విజయం సాధించాలి.. ఎన్టీఆర్ ఆకాంక్ష! అల్లిపూర్ సర్పంచ్ వీరేశం మృతి

ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీకొన్న దివ్యాంగుడు - బాధితుడి పరిస్థితి విషమం

Select Suryaa Now
ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీకొన్న దివ్యాంగుడు   - బాధితుడి పరిస్థితి విషమం

ఆగి ఉన్న ట్రాక్టర్ ను ఢీకొన్న దివ్యాంగుడు 
 - బాధితుడి పరిస్థితి విషమం

మదనపల్లె టౌన్:   ఆగి ఉన్న ట్రాక్టర్ ను బైక్ తో ఢీకొని ఓ దివ్యాంగుడు తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన ఘటన మంగళవారం రాత్రి పెద్దమండెం మండలంలో జరిగింది. బాధితుడి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మిట్టవాండ్లపల్లెకు చెందిన ఎం. జయరాంరెడ్డి (40) పెద్దమండెం నుంచి బైక్ లో ఇంటికి వస్తుండగా, మిట్టవాండ్లపల్లె మలుపు వద్ద రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్ ను వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొన్నాడు.
ఈ ప్రమాదంలో కాళ్లు, చేతులు, తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది బాధితుడిని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం తిరుపతికి రెఫర్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.