20 మంది హెచ్ఎం లకు షోకాజ్ నోటీసులు
20 మంది హెచ్ఎం లకు షోకాజ్ నోటీసులు
అనంతపురం బ్యూరో
అనంతపురం జిల్లాలోని ఉన్నత పాఠశాలలకు చెందిన 20 మంది హెచ్ఎం లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా డిఈఓ అయ్యూబ్ హుస్సేన్ ఉత్తర్వులను జారీ చేశారు. ఈనెల 25వ తేదీన బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో నిర్వహించిన హెచ్ఎం లతో ప్రత్యేక సమావేశం లో గైర్హజరైన 20 మంది హెచ్ఎం లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా అధికారులు స్పష్టం చేశారు. సంబంధిత హెచ్ఎం లు వెంటనే దీనికి సంబంధించి నివేదికలను జిల్లా విద్యాశాఖ అధికారి కి అందించాలని వారు కోరారు. సరైన సమాధానం ఇవ్వకపోతే వారికి పట్టిన చర్యలు తప్పవని హెచ్చరించారు.