ప్రశాంతంగా పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు
అనుమసముద్రంపేట మేజర్ న్యూస్ : ఏఎస్ పేట మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిసినట్లు ఎంఈఓ లు ఎం జ్యోతి, డి సాయిప్రసాద్ లు తెలిపారు ఈ సందర్భంగా ఎంఈఓ లు మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించిన ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతినిధులను ఎన్నుకున్నారుఅనుమసముద్రంపేట మండలం యందు ప్రభుత్వ ఆదేశానుసారము మండలం యందలి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోశపాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ ఎం సి ) ఎన్నికలు నిర్వహించారు మండలంలోని మొత్తం 51 పాఠశాల లకు గాను 49 పాఠశాలల్లో ఎన్నికలు జరిగాయి, గుడిపాడుజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , మరియు చిన్న అబ్బిపురం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల లో కోరం లేని కారణంగా ఎన్నికలు వాయిదా వేయడం జరిగిందని తెలిపారు ఈ రెండు పాఠశాలల యందు మరల జిల్లా అధికారుల ఆదేశానుసారము వారిచ్చిన తేదీ యందు ఎన్నికలు నిర్వహించబడతాయని మండల విద్యాశాఖ అధికారులు తెలియజేశారు ఈ రెండు పాఠశాలల మినహా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం జరిగినదని తెలియజేశారు. ఎస్ఎంసి ఎన్నికల సందర్భంగా ఏఎస్పేట పోలీసులు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు ఎస్ఎంసి ఎన్నికల నిర్వహణకు సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎన్నికల సిబ్బంది సంబంధిత అధికారులకు విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు