BREAKING
తూర్పు గంగవరంలో వరుణ యాగం పాల్గొననున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి లాకర్‌బీ బాంబ్ పేలుడు కేసులో 2027 జనవరికి అమెరికా కోర్టు విచారణ ఖరారు యూకే ఆన్‌లైన్ సేఫ్టీ నిబంధనలపై మెటా, టిక్‌‌టాక్, ఎక్స్ న్యాయపోరాటం చౌరస్తాలకు వెలుగులు.. హైమాస్ట్ లైట్ల ఏర్పాటు కీసరగుట్టలో అనుమానాస్పద తవ్వకాలు..! సమాజ దిశ నిర్దేశకులు ఉపాధ్యాయులే. ప్రభుత్వ ఆస్తులపై అక్రమ పెత్తనం సహించం….! బిజెపి కార్యాలయంగా ఎస్ వి యు -విద్యార్థులకు ఒక రూల్, బీజేపీకి ఒక రూల్ - ఇదేనా కూటమి ప్రభుత్వ న్యాయం.? ఎన్ ఎస్ యు ఐ పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం అనంతగిరి ఘాట్ బస్సు ప్రమాదం.. డ్రైవర్ అరెస్ట్ ప్రజా ప్రభుత్వమా... లంచాల ప్రభుత్వమా? మామిడి రైతులకు శిక్షణ -సమగ్ర యాజమాన్యంతోనే అధిక దిగుబడులు డా.ఎస్.శ్రీనివాసులు నేడు తోటపల్లి ప్రాజెక్టులో చేప పిల్లలు విడుదల కార్యక్రమం అన్ని పంచాయతీల్లోనూ 'మన్యం మర్యాద' అమలు చేయాలి కొత్తపల్లి రాము మృతి దేహం లభ్యం...

ప్రకాశం జిల్లాలో ఈ-సంజీవని కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

Select Suryaa Now
ప్రకాశం జిల్లాలో ఈ-సంజీవని కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్, ఛాంబర్లో ఆధ్వర్యంలో ఈ-సంజీవని కార్యక్రమం అమలుపై సమీక్ష

ఒంగోలు, మేజర్ న్యూస్ :

ప్రకాశం జిల్లాలో ఈ-సంజీవని టెలీమెడిసిన్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలో ఈ-సంజీవని కార్యక్రమం అమలు తీరు, ప్రజలకు అందుతున్న సేవలు, అవసరమైన మౌలిక వసతులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ టి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రకాశం జిల్లాలో మొత్తం 62 ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో, ఇందులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు అర్బన్ హెల్త్ సెంటర్లలో ఈ-సంజీవని కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

గుర్తించిన ఆరోగ్య కేంద్రాల్లో పేషెంట్ కేర్ కోఆర్డినేటర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ద్వారా ఈ-సంజీవని సేవలను ప్రజలకు చేరువ చేస్తున్నట్లు తెలిపారు. రోగులకు నాణ్యమైన సాధారణ వైద్య సేవలతో పాటు మాతా-శిశు సంరక్షణ, చిన్నారుల వైద్య సేవలు, అంటువ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులకు సంబంధించిన వైద్య సలహాలు, కౌన్సెలింగ్, ఫాలోఅప్ సేవలు, వైద్య నిపుణుల టెలీ కన్సల్టేషన్, మానసిక ఆరోగ్య సమస్యలకు సంబంధించిన సేవలు అందించనున్నట్లు వివరించారు.

అదేవిధంగా, జిల్లా ఆసుపత్రి కోఆర్డినేటర్ డాక్టర్ కె.వి. లక్ష్మీకుమారి మాట్లాడుతూ, వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాలోని 7 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మరియు కందుకూరు ఏరియా ఆసుపత్రులను ఈ-సంజీవని సేవల కోసం గుర్తించినట్లు తెలిపారు. ఆయా ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేసి ప్రజలకు టెలీమెడిసిన్ సేవలను, స్పెషలిస్ట్ వైద్యుల అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అదే విధంగా జిల్లా ఆసుపత్రి(రిమ్స్ )ప్రతినిధులు ఈ సంజీవిని కార్యక్రమానికి ఒక ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశామని తద్వారా స్పెషలిస్ట్ సేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అనుసంధానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ బి శ్రావణ్ కుమార్ డాక్టర్ నబి,డాక్టర్ నిరంజన్, మరియు ఎన్ హెచ్ ఎం ప్రోగ్రాం అధికారి శ్రీమతి సుబ్బలక్ష్మి, జిల్లా మాస్ మీడియా అధికారి బి నరసింహారావు డిప్యూటీ అధికారి కె ఏ రాజు, ప్రోగ్రాం అధికారులు ప్రభాకర్ రెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.