ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి...ప్రజా సేవే లక్ష్యంగా పనిచేయాలి
- వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, నవంబరు 17, మేజర్ న్యూస్:
ప్రజలు ఎంతో నమ్మకంతో కల్పించిన అవకాశాన్ని ప్రజాసేవకు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పార్వతీపురం పురపాలక సంఘం చైర్‌పర్సన్‌గా ఇటీవల ఎన్నికైన బెలగాం కరుణ, ఈ నెల 23న జరగనున్న తన ప్రమాణ స్వీకార మహోత్సవానికి రావాలని కోరుతూ మంగళవారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులుగా బాధ్యతలు చేపట్టిన వారు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చి ప్రజలు పట్టం కట్టారని, ఆ విషయాన్ని గుర్తుంచుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్వతీపురం పట్టణ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బి. జయబాబు, బి. సీతారాం, బి. రామకృష్ణ, ఎస్. కమల్ కుమార్, పటానా ప్రేమ్, భరతం సాయి, సిరిపురం బాషా, ఏ. నాగేంద్ర, ఎంబోలిసం సుదీప్ తదితరులు పాల్గొన్నారు.