BREAKING
రైతులకు నోటీసులు.. రికార్డులు జిల్లా కేంద్రంలో! పిడుగుపాటుతో ఇల్లు ధ్వంసం-పరిశీలించిన సర్పంచ్ కుమారస్వామి కల్యాణలక్ష్మి.. సక్సెషన్ భూముల దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన.తహసీల్దార్‌ అశోక్‌ పాశమైలారం హరితహారం పార్కు భూమికి రక్షణ కరువు! పది ఎకరాల పార్కు భూమి ఆక్రమణకు గురైందా? ఆసియా తయారీ రంగానికి ఎదురుదెబ్బ చైనా తీరప్రాంత ఒత్తిడిని ధీటుగా ఎదుర్కొంటాం వీబీ-గ్రామ్ జీ చట్టం కింద నూతన ఫిర్యాదుల పరిష్కారానికి 15 రోజుల గడువు షేర్ మొహమ్మద్ పేట సెగ్మెంట్ 2 లో వాసుదేవరెడ్డి దే విజయం అంటున్న గ్రామస్తులు వైద్య రంగంలో కృత్రిమ మేధ విప్లవం..ఏఐ వైపు అడుగులు వేస్తున్న హెల్త్‌కేర్ సెక్టార్ పిజ్జా హట్, కేఎఫ్‌సీ ఆపరేటర్లకు ఊరట..భారీగా తగ్గిన నష్టాలు, పుంజుకున్న విక్రయాలు జర్మనీ ఆర్థిక వ్యవస్థకు ఎదురుదెబ్బ బిపి సంస్థ స్టోన్‌పీక్‌కు కాస్ట్రోల్ వాటా విక్రయం పూర్తి చేసిన ఎనర్జీ దిగ్గజం సౌదీ అరేబియాలో దక్షిణ నగరాల్లో ఆల్-క్లియర్ ప్రకటించిన సివిల్ డిఫెన్స్ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ముగ్గురు మృతి

ప్రజాసేవే పరమావధిగా జీవితాన్ని అంకితం చేసిన మహానేత ఎర్రన్నాయుడు

Select Suryaa Now
ప్రజాసేవే పరమావధిగా జీవితాన్ని అంకితం చేసిన మహానేత ఎర్రన్నాయుడు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఎర్రన్నాయుడు వర్ధంతి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన పార్టీ నేతలు

సూర్య స్టేట్ బ్యూరో, అమరావతి: ప్రజాసేవకు, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత ఎర్రన్నాయుడు అని టీడీపీ నాయకులు కొనియాడారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన నాయకుడిగా, పార్టీ బలోపేతానికి విశేష సేవలందించిన నేతగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎర్రన్నాయుడు చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పనిచేసిన ఆయన సేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు ఏ.వి. రమణ, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర, అన్నవరం దేవస్థానం బోర్డు సభ్యులు రావిపాటి సత్యనారాయణ, పార్టీ నాయకులు పర్చూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.