ప్రజా సమస్యు పరిష్కరించాలి
పామూరు, మేజర్ న్యూస్ :
మండల కేంద్రమైన పామూరు పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ నాయకులు సోమవారం పంచాయతీ కార్యాలయంలో ఇంచార్జ్ ఈవో గరికపాటి వెంకటేష్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి మాట్లాడుతూ డివి పాలెం 6వ లైన్ లో రోడ్డు, సరళాదేవి నగర్ లో సైడ్ కాలువలు, గోపాలపురం హైవే నుంచి రామాలయం వరకు సీసీ రోడ్డు నిర్మించాలని కోరారు. విరాట్ నగర్ లో పాముల కులస్తులకు కుళాయిల ద్వారా నీరు, ఎన్జీవో కాలనీ, ఎర్రజల్ల ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. దోమల బెడద నివారణకు బ్లీచింగ్ చల్లి మందు పిచికారీ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వజ్రాల సుబ్బారావు, సూరిబాబు, కిషన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.